‘800’కు పెరుగుతున్న మద్దతు నిన్న రాధిక, నేడు ఖుష్బూ.. మరి తమిళసంఘాలు ఊరుకుంటాయా?

Update: 2020-10-21 11:10 GMT
క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా '800' అనే సినిమా విజయ్ సేతుపతి మొదలవాల్సి ఉండగా    వివాదాలతో ఆ  సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ ప్రకటించిన సంగతి  తెలిసిందే. ఈ సినిమా మొదలైన నాటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. తమిళ ద్రోహి ముత్తయ్య మురళీధరన్​ జీవితం ఆధారంగా సినిమా తీయొద్దంటూ తమిళసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓ వైపు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విలక్షణ నటుడు విజయ్​ సేతుపతికి సైతం బెదిరింపులు వచ్చాయి.

వరుస వివాదాలు చట్టుముడుతుండటంతో మురళీధరన్​ స్పందించారు. ఈ సినిమానుంచి తప్పుకోవాలంటూ విజయ్​కి  ఆయన లేఖరాశారు. దీనితో మురళీధరన్ కోరిక మేరకు విజయ్ సేతుపతి ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధికా ఇప్పటికే విజయ్​ కి  అండగా నిలవగా.. తాజాగా  మరో సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా విజయ్​కి  మద్దతుగా మాట్లాడారు.  ‘విజయ్​ నువ్వు ధైర్యంగా ఉండు. ఇదివరకు ఎలా ఉండే వాడివో అలాగే ఉండు. అరాచకాలు సృష్టించే వారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. నీ కూతురిపై తప్పుగా మాట్లాడినవాడు తప్పక దొరుకుతాడు. వాడికి శిక్ష కూడా పడుతుంది. కానీ ఎవరికోసమో  మన అభిప్రాయాలను, అభిరుచులను మార్చుకోవాల్సిన అవసరం లేదు. తమిళ సినీ పరిశ్రమ మొత్తం నీకు అండగా ఉంటుంది’ అంటూ ఖుష్బూ ధైర్యం చెప్పారు.
Tags:    

Similar News