కొరటాల మళ్లీ చిక్కుల్లో పడ్డాడు
మహేష్ బాబుతో కొరటాల శివ తీసిన తొలి సినిమా ‘శ్రీమంతుడు’ కథ విషయంలో పెద్ద వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆ కథ తనదంటూ ఓ రచయిత మీడియా ముందుకు రావడం.. కోర్టుకు కూడా వెళ్లడం తెలిసిందే. తర్వాత ఎలాగో ఆ వివాదాన్ని ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మహేష్‌తో కొరటాల తీసిన కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ కూడా మరో రకమైన వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో మహేష్ ‘నవోదయం’ అనే పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవుతాడన్న సంగతి తెలిసిందే. దాన్ని శరత్ కుమార్.. ప్రకాష్ రాజ్ కలిసి మొదలుపెడతారు. అదే రూలింగ్ పార్టీగా ఉంటుంది. ఈ పార్టీ పేరు తమదే అంటూ దాసరి రాము అనే వ్యక్తి ఆరోపించారు.
తాను నవోదయం పార్టీ అధ్యక్షుడినని.. ఇందులో ఆ పార్టీ గుర్తు కూడా తమ నుంచే కాపీ కొట్టారని అతను ఆరోపించాుడ. తమ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు కూడా ఉందని.. అలాంటి పార్టీ పేరును.. దాని గుర్తును సినిమాలో ఇష్టానుసారం ఎలా వాడేసుకుంటారని అతను ప్రశ్నించాడు. ఈ విషయమై దర్శక నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్లు రాము తెలిపాడు. నిజానికి సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ కచ్చితంగా ఏదో ఒక వివాదం రాజేస్తుందని.. ప్రధాన పార్టీల వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి వివాదాలేమీ లేకుండా బయటపడినట్లే కనిపించిందీ చిత్రం. కానీ ఇప్పుడు ఈ అనుకోని వివాదం కొరటాల శివను ఇబ్బందుల్లోకి నెట్టింది. మరి ఈ వివాదాన్ని అతనెలా పరిష్కరించుకుంటాడో చూడాలి.