ఇటీవల రిలీజైన చాలా సినిమాలకు కాపీ క్యాట్ మరక తప్పడం లేదు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్ ని ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారంటూ ప్రచారమైంది. అంతకుముందు చాలా సినిమాలపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. అయితే కాపీ అన్న పదం వినబడకుండా రిలీజైన భారీ చిత్రం `సాహో`పైనా ఇప్పుడు కాపీ క్యాట్ వివాదం ముసురుకోవడం వేడెక్కిస్తోంది.
ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మించిన `సాహో` ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే క్రిటిక్స్ లో చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటలో ఉపయోగించిన బ్యాక్ గ్రౌండ్ ఛాయాచిత్రం తన పెయింటింగ్ `ది బర్నింగ్ మ్యాన్` ని పోలి ఉందని.. దానిని అనుమతి తీసుకోకుండా చౌర్యానికి పాల్పడ్డారని ఆర్టిస్టు షిలో శివ్ సులెమాన్ అనే మహిళ ఆరోపించారు. 2014లో ది బర్నింగ్ మ్యాన్ వద్ద ప్రదర్శనకు పెట్టిన పెయింటిగ్ ఇది. నా కష్టం విలువ తెలుసా? అసలు మీకు స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ శివ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ మేరకు ఇన్ స్టాగ్రమ్ లో సాహో పోస్టర్ ని.. దాంతో పాటే ఒరిజినల్ పెయింటింగ్ ని పోస్ట్ చేశారు. హాలీవుడ్ స్థాయి సినిమా .. అవెంజర్స్ నే కొట్టేస్తున్నాం అంటూ ప్రకటించారు. ఇలా ఒక ఆర్ట్ ని కాపీ కొట్టి తీయాల్సొచ్చిందా.. ఒకవేళ మీ కథను నేను కాపీ కొడితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు శివ్. దీనికి ఆమె ఫ్యాన్స్ నుంచి స్పందన బావుంది. పోస్టర్ వరకూ కాపీ సరే.. ఈ సినిమా కథ కాపీనే అంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పటికి హమ్మయ్య! అనిపిస్తోంది.