పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ చిత్రం `వకీల్ సాబ్` సంచలనాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. రకరకాల అవాంతరాల నడుమ రిలీజైనా పవన్ జోరు ముందు ఇంకేదీ ఆగలేదని స్పష్ఠమవుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలో ఘనమైన వసూళ్లను సాధించింది. అధికారిక సంఖ్యలు ఇంకా ప్రకటించికపోయినా.. ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల వసూళ్లను వసూలు చేసిందని.. పంపిణీదారుల వాటా దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ సోమవారం నాటికి రూ .100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారని ఓ ప్రముఖ పంపిణీదారు వెల్లడించారు.
ఈ చిత్రం మొదటి మూడు రోజులతో పోలిస్తే సోమవారం బుకింగ్స్ పరంగా కొంత డ్రాప్ అయ్యింది. మరోవైపు వకీల్ సాబ్ అమెరికాలో ఒక మిలియన్ క్లబ్ లో అడుపెడుతుందా లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. సెకండ్ వేవ్ లో స్ట్రెయిన్ ప్రభావంతో అట్టుడుకుతున్న అమెరికాలో సినిమాలు ఆడడం అంత సులువుగా లేదు. కానీ పవన్ మానియా కొంతవరకూ వర్కవుటైంది.
తాజా సమాచారం మేరకు.. దాదాపు 660K డాలర్లు వసూలు చేసిందని తెలిసింది. ఈ చిత్రం USA లో బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు 9కోట్లు వసూలవ్వాలి.