కొరియోగ్రఫర్ గా శివశంకర్ స్థానం ప్రత్యేకం. 80వ దశకం నుంచి వివిధ భాషలకి చెందిన సినిమాలకి ఆయన డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ముఖ్యంగా తెలుగు .. తమిళ భాషల్లోని ఎన్నో సినిమాలకి ఆయన డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఎంతో మంది స్టార్ హీరోలకు .. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి ఆయన నృత్య దర్శకత్వాన్ని వహించారు. హీరోల బాడీ లాంగ్వేజ్ .. వాళ్ల ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని డాన్స్ కంపోజ్ చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకునేవారు. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని పాటలను ఆయన కంపోజ్ చేయవలసిందేనని పిలిపించిన సందర్భాలు ఉన్నాయి.
ట్రెండ్ మారిపోయింది .. కొత్త కొరియోగ్రఫర్లు వచ్చారు. దాంతో సహజంగానే ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఖాళీగా లేరు. టీవీల్లో డాన్స్ షోలకి జడ్జ్ గా ఉంటూ, ఆ షోస్ కి మంచి రేటింగ్ రావడానికి కారణమయ్యారు. తనదైన ఒక ప్రత్యేకమైన లుక్ తో ఆకట్టుకునే శివశంకర్ మాస్టర్, అవకాశాన్ని బట్టి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలోను కనిపించారు. అలాంటి ఆయన కోవిడ్ బారిన పడటం దురదృష్టకరం. కరోనా సోకిన కారణంగా ఆయన నాలుగు రోజులుగా AIG హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
విచారకరమైన విషయం ఏమిటంటే ఆయనతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా కరోనా బారిన పడ్డారు. శివశంకర్ లంగ్స్ 75 శాతం వరకూ ఇన్ఫెక్షన్ కి గురయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆయన కండిషన్ క్రిటికల్ గానే ఉందని అంటున్నారు. ట్రీట్మెంట్ కి రోజుకి రెండున్నర లక్షలు అవుతున్నాయట. అయితే ఆ స్థాయి ఖర్చును భరించే ఆర్థికపరమైన శక్తి ఆయనకి లేదని తెలుస్తోంది. ఆయన భార్య .. చిన్నకుమారుడు కూడా కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అందువలన ఒకరి వివరాలను ఒకరు తెలుసుకునే అవకాశం లేదు. అందువలన ఆయనతో పాటు ఆయన కుటుంబం ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఇండస్ట్రీ పెద్దలు పూనుకోవలసి ఉంటుంది.