క‌రోనాని కూడా ప్ర‌చారానికి వాడేస్తున్నారుగా!

Update: 2020-03-24 20:30 GMT
ప్ర‌పంచాన్ని ఒణికిస్తున్న క‌రోనా వైర‌స్ (కొవిడ్-19) విజృంభ‌న‌కు ఝ‌డిసి తెలుగు రాష్ట్రాలు ఎక్క‌డిక‌క్క‌డ లాక్ డౌన్ అయ్యాయి. రెండు రాష్ట్రాల్లో 144 సెక్ష‌న్ అమల్లో ఉంది. ఈనెల 31 వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి ఉంటుంది. అటుపై క‌రోనా వ్యాప్తిని బ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. నేటి సాయంత్రం దేశ ప్ర‌ధాని వైర‌స్ వ్యాప్తిని ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా ఉండ‌బోతాయో హెచ్చ‌రించ‌నున్నారు. ఇక సెల‌బ్రిటీలు క‌రోనా మ‌హ‌మ్మారి గురించి సోష‌ల్ మీడియా ద్వారా అవేర్ నెస్ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చేత‌లు లేని మాట సాయంతో వాళ్లు చెప్పాల్సిందంతా చెబుతున్నారు.

ఇది ఎవ‌రికి వారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త కాబ‌ట్టి ఎవ‌రి జీవితం వారి చేతుల్లోనే ఉంద‌న్న‌ది మాత్రం సత్యం. బ‌య‌ట తిరిగితే కోరి చావును కొనుక్కుని తెచ్చుకున్న‌ట్లేన‌ని సెల‌బ్రిటీలు హెచ్చ‌రిస్తున్నారు. ఆ విష‌యం ప‌క్క‌న‌బెడితే కార‌ణాలైవైనా సెల‌బ్రిటీల‌కు మాత్రం క‌రోనా వైర‌స్ కూడా మంచి ప్ర‌చారం తెచ్చి పెడుతోంద‌న్నది మాత్రం వాస్త‌వం. ఓ వైపు జాగ్ర‌త్త‌లు చెబుతూనే చివ‌రిగా త‌మ సినిమాకు ప్ర‌చారం చేసుకుంటున్నారు. యూ ట్యూబ్ ..ఫేస్ బుక్..ట్విట‌ర్ ఇలా ఏ మాధ్య‌మాన్ని వ‌ద‌ల‌కుండా క‌రోనా గురించి యుద్ధం చేయాల్సిందేనంటూ చివ‌రికి సినిమాల ప్ర‌చారం చేసేసుకుంటున్నారు.

నితిన్...సుధీర్ బాబు వాట్సాప్ మెసేజ్ లు.. ట్విట‌ర్ లైవ్ సందేశాలు బాగానే ఆక‌ర్షించాయి. నితిన్ ఓ అడుగు ముందుకేసి ఏపీ- తెలంగాణ ప్ర‌భుత్వ స‌హాయ నిధికి 10 ల‌క్ష‌లు చోప్పున విరాళంగా ప్ర‌క‌టించి.. క‌రోనా సోకిన వారికోసం ఈ నిధి అని చెప్పాడు. వీళ్లు స‌రే మిగ‌తావాళ్ల సంగ‌తేమిటి? ఇంకా చాలా మంది సెల‌బ్రిటీలు స్పందించాల్సి ఉంది. జాతీయ విపత్తు కాబ‌ట్టి సెల‌బ్రిటీలు...ఇండియాలో ఉన్న కుబేరులంతా చేయూత‌నివ్వాల్సిన స‌మ‌య‌మిది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించింది చాలా త‌క్కువ మంది. ముఖ్యంగా సెల‌బ్రిటీలు ఈ విష‌యాన్ని ఇంకా సీరియ‌స్ గా తీసుకుని ముందుకు సాగాలి అన్న మాట వినిపిస్తోంది అలాగే ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి డ‌బ్బును త‌రలించే కంటే నేరుగా ఎవ‌రి అసోసియేష‌న్స్ ద్వారా వాళ్లు బాధితుల‌కు అందేలా చేస్తే ఇంకా బాగుంటుంద‌నేది ఫిల్మ్ న‌గ‌ర్ పెద్ద‌లు చెప్పే మాట‌. అటు ప్ర‌చారానికి ప్ర‌చారం.. వ్య‌క్తిగ‌తంగాను ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ఇది సాయ‌మ‌వుతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News