కరోనా పాజిటివ్ , కానీ లక్షణాలు లేవంటున్న నటుడు

Update: 2020-03-21 23:30 GMT
కరోనా వైరస్ ప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేస్తోంది. ప్రపంచంలో  అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం సుమారుగా 2 లక్షల మందికి పైగా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అలాగే కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 10 వేలకి దాటిపోయింది. ఇప్పటికీ కూడా ఈ కరోనా వైరస్‌ కు ఇంకా సరైన మందులేదు. అలాగే  ఈ వైరస్ సోకిందని నిర్దారణ చేయడానికి ఎక్కువ సమయం పట్టడం, అది కూడా పాజిటివ్ అని కన్ఫామ్ చేయడానికే ఒకటి నుండి  రెండు రోజుల సమయం పడుతుండటంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు.

అయితే , ఈ కరోనా వైరస్ వల్ల హాలీవుడ్ నటుడికి ఒక వింత అనుభవం ఎదురైంది. హాలీవుడ్ ప్రముఖ నటుడు ఇడ్రిస్ ఎల్బాకు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అయన  స్పందిస్తూ.. ‘ఈ రోజు ఉదయం నాకు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. నాలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించక పోయినా పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో నేను ఐసోలేషన్ వార్డ్ లో ఉండి చికిత్స పొందుతున్నాను. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి అని  ట్వీట్ చేశాడు. అలాగే కరోనా వైరస్  వేగంగా వ్యాప్తి చెందడాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి అని , అందరూ జనసమూహాలకు దూరంగా ఉండటంతోపాటు ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి అని , ఎవరైనా  అనారోగ్యానికి గురైతే వెంటనే పరీక్ష చేయించుకోండి అని ఇడ్రిస్ తెలిపాడు.
 
కరోనా పాజిటివ్ అని తేలింది కానీ ఆ లక్షణాలు మాత్రం లేవని చెప్పుకొచ్చాడు ఇడ్రిస్. అసలు ఎంత కాలం నుంచి ఇలా ఉందని ఆయన్ను నెటిజన్స్ ప్రశ్నించగా..గత  ఆదివారం పాజిటివ్ అని వచ్చింది కానీ ఇంతవరకు కరోనా లక్షణాలు మాత్రం బయట పడలేదని, తాను క్షేమంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగెటివ్‌ గా స్పందించారు అని తెలిపారు. తన భార్యను తన నుంచి దూరంగా ఉండమని అందరూ సలహా ఇచ్చారు. ఆమెకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని, ఆమెకు ఈ వైరస్ సోకలేదని,  ప్రస్తుతానికి అంతా బాగుంది అని , ఎవరు ఖంగారు పడాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
Tags:    

Similar News