మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలతో COVID-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని చిరు స్వయంగా ప్రకటించారు. చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇలా రాసారు..``ప్రియమైనవారందరికీ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను గత రాత్రి తేలికపాటి లక్షణాలతో బాధపడ్డాను. కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఇంట్లోనే నిర్బంధంలో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోగలరని అభ్యర్థిస్తున్నాను. మీ అందరినీ త్వరలో తిరిగి చూడటానికి వేచి ఉండలేను!`` అని అన్నారు. చిరుకి ఇంతకుముందు కూడా కోవిడ్ పాజిటివ్ అని టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత అది నిర్ధారణ కాలేదని స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే కోలుకున్నారని కూడా అన్నారు. ఇప్పుడు మరోసారి స్వల్పలక్షణాలు కనిపించాయి.
నిజానికి కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా భారిన పడి కోలుకున్నారు. థర్డ్ వేవ్ లో ఓమిక్రాన్ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. దేశంలో 60శాతం మందికి మహమ్మారీ వచ్చి వెళుతుందన్న లెక్కల ప్రకారం ప్రతి ఇంట్లో ఏదో ఒక లక్షణం బయటపడుతూనే ఉంది. ఇటీవల వరుసగా సెలబ్రిటీల్లో డజను పైగా తారలు కోవిడ్ భారినపడ్డారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. స్వల్పలక్షణాలే కనుక ఆయన త్వరగా కోలుకుని తిరిగి యథావిధిగా షూటింగుల్లో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
చిరు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించాల్సి ఉండగా కోవిడ్ కల్లోలం వల్ల ప్రతిదీ ఆలస్యమవుతోంది. ఆచార్య ఇప్పటికే రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. అలాగే గాడ్ ఫాదర్ చిత్రీకరణను ముగించి భోళాశంకర్- వాల్టేర్ శీను చిత్రాల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కోవిడ్ బ్రేక్స్ తో షూటింగులన్నీ ఆలస్యమవుతున్నాయి.