హనీ పెళ్లికి అడ్డు పడ్డ కరోనా వైరస్‌

Update: 2021-05-27 10:37 GMT
ఎఫ్‌ 2 లో హనీ ఈజ్‌ ద బెస్ట్‌ అంటూ సందడి చేసిన మెహ్రీన్ కౌర్‌ జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ పేరు దక్కించుకున్నా ఆఫర్లు మాత్రం అంతంత మాత్రంగానే దక్కించుకుంటుంది. సినిమాల్లో ఆఫర్లు తక్కువ అయిన నేపథ్యంలో ఈమె పెళ్లికి సిద్దం అయ్యింది. కొన్ని నెలల క్రితమే తాను ప్రేమలో ఉన్నట్లుగా పేర్కొన్న మెహ్రీన్‌ ప్రేమించిన వ్యక్తి భవ్య భీష్నోయి మార్చిలో వివాహ నిశ్చితార్థం చేసుకుంది. ఆ సమయంలోనే పెళ్లిని జూన్‌ లో ఉంటుందని మెహ్రీన్‌ అనధికారికంగా పేర్కొంది. కాని ఇప్పుడు మెహ్రీన్‌ పెళ్లి అనుకున్న సమయానికి జరిగేలా లేదంటున్నారు.

మెహ్రీన్ కాబోయే భర్త భవ్య భీష్నోయి తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో పలువురు కరోనా బారిన పడ్డారట. దాంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో చాలా వరకు పెళ్లిల్లు నిలిచి పోతున్నాయి. ఇప్పుడు హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్ పెళ్లి కూడా కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా నిలిచి పోయింది. మళ్లీ కొత్త ముహూర్తం ఎప్పుడు అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ ఇచ్చే అకాశం ఉంది.

మరో వైపు మెహ్రీన్‌ మరోసారి హనీ గా కనిపించబోతుంది. ఎఫ్‌ 2 లో హనీ ఈజ్‌ ద బెస్ట్‌ అంటూ విభిన్నమైన మేనరిజంతో ఆకట్టుకున్న మెహ్రీన్‌ ఎఫ్‌ 3 లో ఎలా కనిపించబోతుందో చూడాలి. కరోనా కారణంగా ఎఫ్ 3 సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచి పోయింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ను వచ్చే ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. కాని ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News