కార్పొరేట్ ప్రొడ్యూసర్స్ మన ట్రెడిషినల్ ప్రొడ్యూసర్స్ కి ధీటుగా నిలబడగలరా...?
ఇటీవల కాలంలో చాలా కార్పొరేట్ కంపెనీస్ సినిమా నిర్మాణంలోకి దిగాయి. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీస్తూ సినీ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాలని ట్రై చేస్తున్నాయి. అయితే ఈ కార్పొరేట్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద దెబ్బ తింటున్నాయి. మన తెలుగులో కూడా చాలామంది కార్పొరేట్ ప్రొడ్యూసర్స్ అడుగుపెట్టారు. టాలీవుడ్ స్టార్ హీరోలను నమ్ముకొని వారు నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ దాదాపుగా దెబ్బ తిన్నవే. అయితే దీనికి ప్రధాన కారణం ఇక్కడ సినిమాల మీద సినీ మార్కెట్ మీద అవగాహన లేకపోవడమే అని తెలుస్తోంది.
కాగా టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ గా వెలుగొందతున్న వారందరూ సినిమా ప్రొడక్షన్ విషయంలో తలపండిన వారే. ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిస్టమాటిక్ గా వెళ్తుంటారు. నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టడం వరకే అని కాకుండా స్టోరీ దగ్గర నుంచి నటీనటుల ఎంపిక వరకు.. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు అన్నీ తామై చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సినిమాకి కావాల్సిన బజ్ ని క్రియేట్ చేసుకుంటూ డిస్ట్రిబ్యూటర్స్ తో బయ్యర్లతో అనుసంధానం అవుతూ బిజినెస్ చేసుకుంటుంటారు. అయితే కార్పొరేట్ ప్రొడ్యూసర్స్ కి దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే నష్టాలు చవిచూస్తున్నారని తెలుస్తోంది. లోకల్ సినిమాలు లోకల్ మార్కెట్ ఎలా ఉంటుందో అనే వాటిపై సరైన గైడెన్స్ లేకపోవడం దీనికి కారణంగా చెప్పవచ్చు. అందుకే లోకల్ ప్రొడ్యూసర్స్ తో పోల్చుకుంటే బిజినెస్ పరంగా సక్సెస్ కాలేకపోతున్నారు.
ఈ మధ్య కొన్ని బాలీవుడ్ కార్పొరేట్ కంపెనీలు మన స్టార్ హీరోలతో సినిమాలు తీశాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమాలు ఘోర పరాజయం చవిచూసి చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇప్పుడు లేటెస్టుగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో సినిమాలు విడుదల చేస్తున్న కంపెనీలు కూడా లోకల్ సినిమాలపై అవగాహన లేక భారీగా చెల్లించి సినిమాలు కొంటున్నారు. తీరా అవి స్ట్రీమింగ్ అయ్యాక వ్యూయర్ షిప్ చూసి షాక్ తింటున్నారు. నిజానికి వీరు తమ కంపెనీలో పనిచేసే కొంతమంది ఎంప్లాయిస్ ద్వారా డీల్స్ చేసి సినిమాలు ప్రొడ్యూస్ చేయడమో రిలీజ్ చేయడమో చేస్తుంటారు. కానీ వారు సినిమా ఎంత మార్కెట్ చేస్తుంది అనే గెస్సింగ్స్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలుస్తోంది.
అయితే సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఈ కార్పొరేట్ కంపెనీస్ లోకల్ సినీ ఇండస్ట్రీలోని కొందరు అనుభవం ఉన్న వ్యక్తులను టీమ్ గా పెట్టుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారి సహాయం తీసుకుంటూ ఏ సినిమాని కొనాలి? ఏ సినిమాకి ఎంత పెట్టొచ్చు? అనే విషయాలపై డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటే ఈ కార్పొరేట్ కంపెనీలు నిలబడే ఛాన్సెస్ ఉంటాయని సూచిస్తున్నారు. ఏదో ఇన్వెస్ట్ చేసాం.. సినిమా కొని రిలీజ్ చేసాం అనే రీతిన బ్లైండ్ గా వెళ్తే ఇంతకముందు కార్పొరేట్ సంస్థలకు ఎదురైన అనుభవాలు చూడాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ కార్పొరేట్ ప్రొడ్యూసర్స్ అందరూ ట్రెడిషినల్ ప్రొడ్యూసర్స్ కి ధీటుగా నిలబడాలంటే లోకల్ సినిమా మార్కెట్ పై అవగాహన పెంచుకోవాలని వారు సూచిస్తున్నారు.