ఎపిక్స్‌కి కాస్ట్యూమ్స్‌ అంటే మజాకానా!!

Update: 2015-07-02 06:14 GMT
ఎపిక్‌ సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. దానికి బోలెడన్ని లెక్కలుంటాయి. కాలమానాన్ని బట్టి కల్చర్‌, పాత్రల తీరుతెన్నులు, ప్రవర్తన, కాస్ట్యూమ్స్‌, ఆభరణాల డిజైనింగ్‌ చేయాలి. అందుకోసం స్పెషలిస్టులైన డిజైనర్లు పని చేస్తేనే పనవుతుంది. 16వ శతాబ్ధంలో ప్రజలు ఎలా ఉండేవారు? కల్చర్‌ ఏంటి? తెలియకుండానే డ్రెస్‌ డిజైన్‌ చేస్తే బావుంటుందా? 16వ శతాబ్ధం నాటికి జిప్పులు, బటన్‌లు రాలేదు. కాబట్టి అవేవీ కాస్ట్యూమ్స్‌లో కనిపించకూడదు. కనిపిస్తే అది 20వ శతాబ్ధం అవుతుంది. అలాంటి తప్పుల్ని ప్రేక్షకులు అస్సలు క్షమించరు. అందుకే ఇటీవలి కాలంలో తెరకెక్కిన ఓ మూడు సినిమాల కాస్ట్యూమ్‌ డిజైనర్ల పనితీరు పరిశీలిస్తే ఆసక్తి కర సంగతులు తెలిశాయి...  మీ కోసమే ఈ ఆసక్తికర కథనం..

రమా చేతిలో 'బాహుబలి':  ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌. రాజమౌళి బాహుబలి క్యారెక్టర్ల డిజైన్‌ కోసం రెండేళ్లు తీసుకుంటే ఈ సినిమాలో క్యారెక్టర్ల డ్రెస్‌ డిజైన్ల కోసమే రమా రాజమౌళి సంవత్సరం టైమ్‌ తీసుకున్నారు. సెప్లెంబర్‌ 2012లో పని మొదలు పెట్టి రామాయణ, మహాభారతాల్లోని కాస్ట్యూమ్స్‌ లుక్‌ ఎలా ఉంది చెక్‌ చేసుకున్నారు రమ. అమరచిత్రకథను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. ఆ టైమ్‌లో ఎపిక్‌ ఫిలింస్‌ని, కల్చర్‌ని స్టడీ చేశారు. అంతే కాదండోయ్‌ బాహుబలిలోని ఒక్కో పాత్ర కోసం ఎలాంటి కాస్ట్యూమ్స్‌ వాడాలి అన్నదానిపై బోలెడన్ని స్కెచ్‌లు గీశారు. కేవలం ఈ స్కెచ్‌ పేపర్లతోనే మూడు ర్యాక్‌లు నిండిపోయాయి. క్యారెక్టర్ల యాంటిక్‌ లుక్‌ కోసం సిల్వర్‌ బబుల్స్‌పై, గోల్డ్‌ కలర్‌ని అద్దారు.

'రుద్రమ' నీతా లుల్లా: గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన 'రుద్రమదేవి 3డి' కోసం డిజైనర్‌గా పనిచేశారు. కథాంశం ప్రకారం అనుష్కను హీరోలా చూపించాలి. అదే టైమ్‌లో ఆడది అని గుర్తు చేసేలా కాస్ట్యూమ్స్‌ ఉండాలి. దీనికోసం నీతా చాలా శ్రమించారు. కాకతీయుల కాలం నాటి వాతావరణం ఎలా ఉంటుంది. నాటి కల్చర్‌ ఏంటి అన్నదానిపై పరిశోధనను గుణశేఖర్‌ నీతా ముందుంచారు. దాని ఆధారంగా డ్రెస్‌ డిజైన్‌ చేశారు. కాస్ట్యూమ్స్‌, జువెలరీని సిల్వర్‌, గోల్డ్‌లో డిజైన్‌ చేశారు.

బాజీరావ్‌ మస్తానీ కోసం అంజు: ఈ సినిమా కోసం అంజు మోడి డిజైనర్‌గా పనిచేశారు. అజంతా, ఎల్లోరా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే కథాంశం కాబట్టి అందుకు తగ్గట్టే డ్రెస్‌ డిజైన్ల పరిశీలన కోసం అజంతా, ఎల్లోరా పరిసరాల్ని సందర్శించారు. పైతాన్‌, ఇండోర్‌ బెనారస్‌ భవంతుల్ని సందర్శించారు. హైదరాబాద్‌ సాలార్‌జంగ్‌ మ్యూజియంని సందర్శించారు. భాజీరావ్‌ అంటే మహారాష్ట్రియన్‌, మస్తానీ ముస్లిమ్‌ యువతి కాబట్టి ఈ ఇద్దరికోసం కాస్ట్యూమ్స్‌ని చరిత్రను పరిశీలించాకే డిజైన్‌ చేశారు. ఇప్పటికే 20 సన్నివేశాల కోసం 108 రకాల కాస్ట్యూమ్స్‌ని మోడి డిజైన్‌ చేశారు. దీపిక, ప్రియాంక కాస్ట్యూమ్స్‌ కోసం తీవ్రంగా శ్రమించాల్సొచ్చిందని మోదీ చెప్పారు.

Tags:    

Similar News