అనూహ్యం: ఆస్కార్ బ‌రిలో కోర్ట్‌

Update: 2015-09-23 11:16 GMT
ఇండియా నుంచి ఆస్కార్ నామినేష‌న్‌ కి వెళ్లే సినిమా ఏది? 2014 - 15లో రిలీజైన ఏ సినిమాకి ఈ అర్హ‌త ఉంది? ఇది ఇంత‌కాలం స‌స్పెన్స్‌. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ఆస్కార్‌ కి వెళుతుంద‌ని కొంద‌రు భావించారు. అయితే ఈ సినిమా పూర్తి స్థాయి క‌థ‌తో తెర‌కెక్క‌లేదు. క‌న్‌ క్లూజ‌న్ లేని సినిమాలు ఆస్కార్‌ కి వెళ్ల‌వు అని అప్పట్లో ప‌లువురు విశ్లేష‌కులు విశ్లేషించారు. అనుకున్నంతా అయ్యింది. ఇప్పుడు ఆస్కార్ రేసులో ఉన్న బాహుబ‌లికి అందుకు ఆస్కార‌మే లేకుండా పోవ‌డం బాధాక‌రం.

మ‌న‌దేశం నుంచి కోర్ట్ అనే సినిమాని ఆస్కార్ బ‌రిలోకి పంపించేందుకు దేశీయ సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేసింది. అంతా కొత్త ముఖాల‌తో తీసిన ఈ సినిమా ద‌ర్శ‌కుడు కానీ, మేక‌ర్స్ గురించి కానీ ఎవ‌రికీ అంత‌గా తెలియ‌నే తెలీదు. 2015లో రిలీజైన ఈ సినిమా ఓ కోర్ట్ డ్రామా. ఈ చిత్రాన్ని చైత‌న్య త‌మానే అనే ఔత్సాహిక ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు. వివేక్ గోంబెర్ నిర్మించారు. విరా సాథిద‌ర్‌ - వివేక్ గోంబెర్ గీతాంజ‌లి కుల‌క‌ర్ణి - ప్ర‌దీప్ జోషి త‌దిత‌రులు న‌టించారు. సాంబాజీ భ‌గ‌త్ సంగీతం అందించారు. కోర్ట్ 2014లో 71వ వెనిస్ ఫిలింఫెస్టివ‌ల్స్‌ లో ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకుంది. హారిజ‌న్స్ కేట‌గిరీలో అక్క‌డ ఉత్త‌మ సినిమా అవార్డును అందుకుంది.

116 నిమిషాల ఈ సినిమా ఇండియాలో ఏప్రిల్ 17న రిలీజైంది. మ‌రాఠీ - హిందీ - ఇంగ్లీష్‌ - గుజ‌రాతీ నాలుగు భాష‌ల్లో రిలీజైంది ఈ సినిమా. 600 కోట్ల వ‌సూళ్లు సాధించిన బాహుబ‌లికి ద‌క్క‌ని భాగ్యం చాలా సింపుల్ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిన కోర్ట్ అందుకుంది. అదీ మ్యాట‌రు.
Tags:    

Similar News