ఉత్తరాదిన సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ ను సౌత్ లో గత రెండేళ్లుగా ప్రసారం చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తి అయ్యాయి. తమిళంలో మొదటి రెండు సీజన్ లు కూడా తీవ్ర వివాదాలను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. కోర్టు కేసులు.. విమర్శలను ఎదుర్కొన్న తమిళ బిగ్ బాస్ ఇప్పుడు మూడవ సీజన్‌కు సిద్దం అయ్యింది. ఇటీవలే మూడవ సీజన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
మూడవ సీజన్ కు కూడా కమల్ హాసన్ హోస్టింగ్ చేయబోతున్నాడు. మొదటి రెండు సీజన్ ల మాదిరిగానే మూడవ సీజన్ కు కూడా వివాదాలు చెలరేగుతున్నాయి. ఇంకా సీజన్ ప్రారంభం కాకుండానే కోర్టు కేసుల వరకు వెళ్లింది. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి బిగ్ బాస్ వల్ల తమిళ సంస్కృతి దెబ్బతింటుందంటూ కోర్టులో పిటీషన్ వేశాడు. బిగ్ బాస్ కు సెన్సార్ చేయాలంటూ అతడు డిమాండ్ చేస్తున్నాడు.
అతడి పిటీషన్ ను స్వీకరించిన కోర్టు నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగిందట. ఇలాంటి రియాల్టీ షోలకు సెన్సార్ సాధ్యసాధ్యల గురించి చర్చించే అవకాశం ఉంది. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రతి ఎపిసోడ్ ను సెన్సార్ చేయడం అసాధ్యం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్ కూడా వివాదాలతో మంచి టీఆర్పీ దక్కించకుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.