ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్స్ వున్నా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేకత వేరు. ఆయన పుట్టిన రోజు నేడు. ఏ స్టార్ హీరోకైనా ఫ్లాప్ వస్తే మార్కెట్ లెక్కలు మారిపోవడం అత్యంత సహజం కానీ పవన్ మేనియా అందుకు పూర్తి భిన్నం. ఫ్లాప్ లు వచ్చినా.. బ్లాక్ బస్టర్లు పలకరించినా చెక్కు చెదరని మార్కెట్ పవన్ సొంతం. ఇది టాలీవుడ్ ఇంత వరకు ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్. ట్రేడ్ వర్గాలు సైతం ముక్తకంఠంతో అంగీకరించిన పచ్చి నిజమిది.
మెగాస్టార్ కే లేని క్రేజ్ పవన్ కు సొంతం అంటే అది అతిశయోక్తికాదు. ఈ విషయాన్ని స్వయంగా చిరు చెప్పి మురసిన సందర్భాలు చాలానే వున్నాయి. మనలో ఒకడి లాంటి పాత్రలతో ప్రేక్షకుల్లో ఒకడిగా మారి రికార్డు స్థాయిలో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హీరో పవర్ స్టార్ పవర్ కల్యాణ్. అతని సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఓల్డ్ బ్లాక్ బస్టర్స్ రీరిలీజ్ అయినా ఫ్యాన్స్ హంగామా థియేటర్ల వద్ద ఏ స్థాయిలో వుంటుందో జల్సా, తమ్ముడు సినిమాలు రీసెంట్ గా విడుదలై పవన్ స్టామినా ఏంటో మరో సారి రుజువు చేశాయి.
థియేటర్లకు హెవీ క్రౌడ్ పుల్లర్ గా నిలిచి పవర్ స్టార్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డుని సృష్టించారు. అనుకోకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకుంటే బెంగళూరులో నర్సరీ పెట్టాలనుకున్నారట. మూడేళ్లు అనుకున్న సినిమా పట్టాలెక్కకపోవడంతో ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పాడట పవన్ కల్యాణ్. అయితే అదే రోజు సినిమా పట్టాలెక్కబోతోందనే శుభవార్త విన్నాడట. అదే 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి'. 1996లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ మూవీతో పవన్ తెరంగేట్రం చేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు.
కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఈ మూవీ తరువాత పవన్ కల్యాణ్ చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతూ వచ్చింది. గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషీ సినిమాలు హిట్ లు, సూపర్ హిట్ లు, బ్లాక్ బస్టర్ హిట్ లు గా నిలిచి అప్పటి వరకు చిరు సోదరుడిగా వున్న పవన్ కు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచడమే కాకుండా ప్రత్యేక స్టార్ డమ్ ని తెచ్చి పెట్టాయి.
అప్పటి నుంచి పవన్ కల్యాణ్ అభిమానులకు, బాక్సాఫీస్ కు ఓ మాస్ సునామీగా మారిపోయారు. హేవీ క్రౌడ్ ని థియేటర్లకు రప్పించే క్రౌడ్ పుల్లర్ అనిపించుకున్నారు. 'ఖుషీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పవన్ కల్యాణ్ హిట్టు మాట విని కొన్నేళ్లయింది. అయినా సరే తన మార్కెట్ స్టాయి ఏ మాత్రం తగ్గకపోవడం ఇప్పటికీ ట్రేడ్ వర్గాల్లో ఓ రికార్డుగా చెబుతారు. జెన్యూన్ గా చెప్పాలంటే 'జానీ' నుంచి 'అన్నవరం' వరకు పవన్ నుంచి ఒక్క టంటే ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు.
'జల్సా' హిట్ అనిపించుకుంటే దాదాపు పదేళ్లకు 'గబ్బర్ సింగ్' రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ఎంత కాలంగా పవన్ మార్కు సినిమా కోసం ఆకలిగా వున్న ఫ్యాన్స్ కు పండగని తెచ్చిన సినిమా ఇది. ఆ తరువాత 'అత్తారింటికి దారేది' మళ్లీ ఆ స్థాయి సక్సెస్ ని అందించి పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని నింపింది. 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ తరువాత పవన్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా వుండటం తో మూడున్నరేళ్లు సినిమాలకు దూకరంగా వున్నారు.
ఆ తరువాత 'వకీల్ సాబ్'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచారు. మూడున్నరేళ్ల గ్యాప్ వచ్చినా ఫ్యాన్స్ లో, పవన్ మార్కెట్ లో ఏ మాత్రం హెచ్చతగ్గులు కనిపించలేదు. క్రేజ్ మరింతగా పెరిగిందే కానీ ఎక్కడా తగ్గకపోవడం విశేషం. పవన్ సినిమాలు ఆపినా.. తిరగి మళ్లీ సినిమాల్లోకి వచ్చినా అభిమానులు ఆయన వెంటే వున్నారు.. ఆయనపై మరింత అభిమానాన్ని కురిపించడం మొదలు పెట్టారు. రీసెంట్ గా పవన్ పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజ్ చేసిన 'జల్సా', తమ్ముడు సినిమా థియేటర్ల వద్ద కనిపిస్తున్న మాస్ ఫోబియానే ఇందుకు నిదర్శనం. ఫ్యాన్స్ పాలిట పవన్ కల్యాణ్.. ఓ మాస్ సునామీ అని తాజా రీరిలీజ్ లు మరో సారి నిరూపించి ఎక్కడా తగ్గని పవన్ కల్యాణ్ స్టార్ డమ్ ని గుర్తుచేయడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.