ప్రతీవారం సినీ అభిమానులను అలరించడానికి అనేక సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాలేవీ లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద చిన్నా చితక సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిల్లో కొన్ని సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అవుతుంటే.. మరికొన్ని చిత్రాలు ఓటీటీ వేదికగా వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. ఈ వారం థియేటర్లు మరియు డిజిటల్ వేదికలలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు టైటిల్ రోల్ పోషించిన చిత్రం ''యశోద''. హరి & హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ - వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. సరోగసీ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ నవంబర్ 11న విడుదల కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'జాను' తర్వాత సామ్ నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
'ఆటగదరా శివ' ఫేమ్ ఉదయ్ శంకర్ నటించిన 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ' అనే సినిమా నవంబర్ 11న థియేటర్లలోకి వస్తోంది. అదే రోజున 'మది' అనే మరో చిన్న చిత్రం కూడా అదృష్టాన్ని పరీక్షింకోడానికి వస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వంలో 2004లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'వర్షం' చిత్రాన్ని ఈ శుక్రవారం రెండు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు.
హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - బోమన్ ఇరానీ - అనుపమ్ ఖేర్ - పరిణీతి చోప్రా - నీనా గుప్తా - సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ''ఊంచాయి'' అనే సినిమా నవంబర్ 11న రిలీజ్ అవుతోంది. ఇక తమిళ్ లో ఐశ్వర్య రాజేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన ''డ్రైవర్ జమున'' అనే సినిమా థియేటర్లలోకి వస్తోంది. అలానే 'బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్' అనే హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం కూడా ఈ వారమే విడుదల కాబోతోంది.
ఇక ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మలయాళ హీరో మమ్ముట్టి నటించిన 'రోషాక్' అనే తెలుగు డబ్బింగ్ సినిమా నవంబర్ 11న విడుదల కాబోతోంది. అలానే నవంబర్ 9న 'సేవ్ అవర్ స్క్వాడ్'.. నవంబర్ 10న 'మనీ మాఫియా 3' అనే ఒరిజినల్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ZEE ఓటీటీలో నవంబర్ 11న 'ముక్భీర్: ది స్టోరీ ఆఫ్ ఎ స్పై' (హిందీ సిరీస్) ప్రసారం కాబోతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అభిషేక్ బచ్చన్ - నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ''బ్రీత్: ఇన్ టు ది షాడోస్'' సిరీస్ సీజన్-2 నవంబర్ 9న స్ట్రీమింగ్ కానుంది. అలానే నవంబరు 11న ఇరవిన్ నిజల్ (తమిళం) మరియు సిక్సర్ అనే హిందీ సిరీస్ అందుబాటులోకి రానున్నాయి. ఇక నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రాజ్ కుమార్ రావ్ - హ్యూమా ఖురేషి - రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ''మోనికా, ఓ మై డార్లింగ్'' అనే హిందీ చిత్రం నవంబర్ 11న రిలీజ్ అవుతోంది. దీంతో పాటుగా 'పూచండి' అనే తమిళ చిత్రం కూడా వస్తోంది. అదే రోజున సోనీ లివ్ ఓటీటీలో 'తనవ్' అనే హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.