దేశ వ్యాప్తంగా టాలీవుడ్ సినిమా బిజినెస్ విస్తరించింది. ఇక్కడ ఏ స్టార్ సినిమా మొదలైనా బాలీవుడ్ నుంచి ఎంక్వైరీలు, డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ కి సంబంధించిన డీల్స్ చక చకా జరిగిపోతున్నాయి. ఇక్కడి స్టార్స్ తో సినిమాలు చేయాలని, ఇక్కడి డైరెక్టర్ లతో కలిసి పని చేయాలని బాలీవుడ్ స్టార్స్ పోటీపడుతున్నారు. ఇప్పటికే కొంత మంది స్టార్ డైరెక్టర్లలో ఫోన్ లలో టచ్ లో వుంటూ ఖర్చీఫ్ వేసేస్తున్నారు. ఇక ఇక్కడ స్టార్ హీరోలతో పాన్ ఇండియాకి మించి సినిమాలు చేయాలని అక్కడ డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా వుంటే టాలీవుడ్ లో మరో కొత్త ట్రెండ్ కు రెండు క్రేజీ ప్రొడక్షన్ కంపనీలు శ్రీకారం చుట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో వున్న టాప్ ప్రొడక్షన్ కంపనీలు ఇలా పరస్పర సహకారంతో ఒకే గొడుగు కింద పలు క్రేజీ ప్రాజెక్ట్ ల కోసం పని చేయాలని ముందుకు రావడానికి సిద్ధమవుతుండటం కొత్త ట్రెండ్ కు నాంది పలకబోతోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు ముంబైలో జరుగుతున్నాయి. గతంలో ఇదే తరహాలో గీతా ఆర్ట్స్, వైజయంతీ మూవీస్ అధినేతలు అల్లు అరవింద్, సి. అశ్వనీదత్ కలిసి సినిమాలు నిర్మించారు.
ఆ తరువాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి గీతా ఆర్ట్స్ 'అల వైకుంఠపురములో' మూవీని నిర్మించారు కూడా. ఇక సురేష్ ప్రొడక్షన్స్ కూడా పలు ప్రొడక్షన్ హౌస్ లతో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. అయితే టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు గా పేరుతున్న మైత్రీ మూవీ మేకర్స్, యువీ క్రియేషన్స్ తొలి సారి కలిసి క్రేజీ ప్రాజెక్ట్ ల కోసం అడుగులు వేయడానికి రెడీ అవుతుండటం మాత్రం టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టడం ఖాయమని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నందమూరి కల్యాణ్ రామ్ లతో సినిమాలు నిర్మిస్తోంది. ప్రభాస్ కు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చేసింది కూడా. అయితే డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. ఇదే తరహాలో యువీ క్రియేషన్స్ రామ్ చరణ్ డేట్స్ ని దక్కించుకుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేయాలనుకుంది కానీ మారిన సమీకరణాల దృష్ట్యా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకుంది కానీ రామ్ చరణ్ డేట్స్ మాత్రం అలాగే వున్నాయి.
ఇక మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు,'వార్' మూవీ ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టాలని తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో యువీ కూడా భాగస్వామి కాబోతోందట. అంటే కాకుండా రామ్ చరణ్ తో యువీ చేయాలనుకున్న ప్రాజెక్ట్ కోసం మైత్రీ వారు డైరెక్టర్ ని వెతికే పనిలో వున్నట్టుగా చెబుతున్నారు. ఈ రెండు బ్యానర్ లు ఒకే గొడుగు కిందికి వస్తే టాలీవుడ్ లో మరిన్ని అద్బుతాలు జరగడం ఖాయమని.. ఇదిసరికొత్త డ్రెండ్ కు శ్రీకారం చుడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.