సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ టైం మహేష్ - పరశురామ్ కాంబినేషన్ సెట్ అయ్యేసరికి సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అలాగే సర్కారు వారి పాట అనే టైటిల్ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు. గతేడాది కాలంగా ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అందుకు కరోనా మహమ్మారి కారణం అని విదితమే. ఈ మహమ్మారి కారణంగా సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ నటిస్తోంది. ఫస్ట్ టైం మహేష్ తో కీర్తి రొమాన్స్ చేయనుంది. ఈ కాంబినేషన్ పై మూవీలవర్స్ బాగానే ఎక్సపెక్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బ్యాంకు కుంభకోణం చుట్టూ తెరకెక్కుతున్న సర్కారు పాట సినిమాను మహేష్ బాబుతో పాటు మైత్రి మూవీస్ - 14రీల్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని టాక్. అయితే ఈ సినిమా లైన్ లో ఉండగానే మహేష్ మరో సినిమాను లైన్ చేసిన విషయం తెలిసిందే. సర్కారు వారి షూటింగ్ ముగిసిన తర్వాత మహేష్.. బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలితో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమాకు డేట్స్ కేటాయించే ముందు మరో సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అందుకే ఇటీవలే డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా ప్రకటించాడు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే డేట్స్ పూర్తిగా పెద్దమొత్తంలో కేటాయించాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం.. సోషల్ మీడియాలో మహేష్ బాబు తదుపరి సినిమా హీరోయిన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
అదేంటంటే మహేష్ బాబు జోడిగా త్రివిక్రమ్ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ను సంప్రదించనున్నారట మేకర్స్. అయితే జాన్వీ ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అలాగని మంచి సూపర్ ఫామ్ లో ఉందని చెప్పలేం. ఎందుకంటే ఇటీవలే అమ్మడు నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. మరి ప్రస్తుతం దోస్తానా 2 పై ఆధారపడి ఉందట. అలాగే అమ్మడు ఎప్పుడెప్పుడు సౌత్ డెబ్యూ చేద్దామా అని వెయిట్ చేస్తున్నట్లు ఆ మధ్యలో వార్తలొచ్చాయి. మరి మహేష్ త్రివిక్రమ్ సినిమాలో జాన్వీ ఓకే అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ జాన్వీ ఓకే చేయాలంటే మాత్రం నిర్మాతలు మినిమం రెమ్యూనరేషన్ చెల్లించాల్సి ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అలాగే లిస్టులో పలువురు హీరోయిన్స్ ఉన్నారట. చూడాలి మరి త్రివిక్రమ్ టీమ్ ఎవరిని ఓకే చేస్తుందో..!