మహేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `సరిలేరు నీకెవ్వరు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. తాజాగా సినిమాకు సంబంధించి ఓ హాట్ అప్ డేట్ అందింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న దేవి శ్రీ ప్రసాద్- దర్శకుడు అనీల్ రావిపూడి మధ్య ట్యూన్స్ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయని ఓ రూమర్ వైరల్ అవుతోంది. దేవి కంపోజ్ చేసిన ట్యూన్స్ విషయంలో అనీల్ సంతృప్తిగా లేడుట. ఇంకా బెటర్ ఇస్తే బాగుంటుందని దేవిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీ ట్యూన్స్ లో కొత్తదనం ఉండాలని పదే పదే అడుగుతున్నాడుట. అయితే ఈ విషయాన్ని దేవీ లైట్ తీసుకుంటున్నాడని సమాచారం. మరి ఇందులో నిజమెంత అన్నది తేలాల్సి ఉంది.
అనీల్ కు దేవీ శ్రీతో పనిచేయడం కొత్తేం కాదు. గతంలో అనీల్ తెరకెక్కించిన ఎఫ్-2 చిత్రానికి దేవి శ్రీనే బాణీలు అందించాడు. ఆ కాన్పిడెన్స్ తోనే మరోసారి సరిలేరులో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ సంగీత దర్శకుడి ఎంపిక అన్నది అనీల్ ఒక్కడి మీదనే ఆధారపడి లేదు. అందులో మహేష్ బాబు పాత్ర అత్యంత కీలకమైనది. మహేష్ కు గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ లు ఇచ్చిన ఘనత దేవి శ్రీ సొంతం. శ్రీమంతుడు- భరత్ అనే నేను- మహర్షి అన్నీ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ అయ్యాయి. ట్యూన్స్ సహా ఆర్ ఆర్ ఆర్ విషయంలో దేవిని నమ్మినంతగా మహేష్ మరొకరిని నమ్మడు. అందుకే సరిలేరులో దేవి శ్రీకి ఛాన్స్ ఈజీ అయింది. మరి తాజా రూమర్ల నేపథ్యంలో యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
గతంలో లెజెండ్ సినిమా సమయంలో బోయపాటి శ్రీను- దేవి శ్రీ మధ్య ఇలాంటి వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దేవి శ్రీ మంచి ట్యూన్స్ ఇచ్చాడంటే కారణంగా నేనే అన్నట్లు బోయపాటి వేదికపై పరోక్షంగా వెల్లడించాడు. దేవి శ్రీని పిండి మరి బెస్ట్ తీసుకున్నానన్నాడు. ఈ నేపథ్యంలో దేవి శ్రీ బాగా హర్ట్ అయ్యాడు. దీంతో బోయపాటి-దేవి శ్రీలు కొన్నాళ్లు మాట్లాడుకోని విషయం తెలిసిందే.