టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ భామ అనుష్క శర్మలు ఇటలీ వెళ్లి మరీ ఒక్కటైపోయారు. ఇద్దరికి ఇద్దరూ సెలబ్రిటీలే. దాంతో వీరి ప్రేమకు - పెళ్లికి ఎక్కడలేని ప్రయారిటీ. అయితే.. ఇలా క్రికెటర్లు - యాక్టర్లు పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కాదు.. చాలాకాలంగా ఇది ఉంది. అంతెందుకు.. కోహ్లీ కంటే ముందు రీసెంటుగా జహీర్ ఖాన్ కూడా ఓ బాలీవుడ్ భామనే పెళ్లాడాడు.
చక్ దే ఇండియాలో నటించిన సాగరికా ఘట్కేను టీమిండియా మాజీ పేసర్ జహీర్ పెళ్లాడాడు. వారిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు.
అలాగే గత ఏడాది క్రికెటర్ యువరాజ్ సింగ్ నటి హజెల్ కీచ్ ను పెళ్లి చేసుకున్నాడు. బాడీగార్డ్ వంటి సినిమాల్లో ఆమె నటించింది.వారి పెళ్లి చండీగడ్ - గోవా - దిల్లీలో ఆరు రోజుల పాటు జరిగింది.
2015లో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ - నటి గీతా బస్రా వివాహం చేసుకున్నారు.
ఇవన్నీ ఇటీవల కాలపు టీమిండియా - బాలీవుడ్ పెళ్లిళ్లు కాగా గతంలోనూ ఇలాంటి పెళ్లిళ్లు జరిగాయి. షర్మిళ టాగోర్ - మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ పెళ్లి 1969లో జరిగింది.
నాగిన్ సినిమాలో నటించిన రీనా రాయ్ పాకిస్థానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ ను 1983లో పెళ్లాడింది. అనంతరం వారు విడాకులు తీసుకున్నారు.
అలాగే బాలీవుడ్ నటి నీనాగుప్తా - విండీస్ దిగ్గజం రిచర్డ్డ్స్ మధ్య రిలేషన్ షిప్ ఉండేది. వారికి ఒక కూతురు కూడా ఉంది. కానీ, వారు పెళ్లి చేసుకోలేదు.
ఇక మన హైదరాబాదీ - మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కూడా బాలీవుడ్ సుందరాంగి సంగీతా బిజ్లానీని పెళ్లాడారు. కానీ, వారిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు.