టాలీవుడ్ దర్శకుడు తేజ మీద క్రిమినల్ కేసు నమోదైంది. కలప వ్యాపారిని బెదిరించిన కేసులో ఆయనపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తేజ మీద క్రిమినల్ కేసు నమోదు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కు చెందిన పలువురు కేసుల్లో చిక్కుకుంటున్నారు.
ఇక.. తేజ కేసు విషయానికి వస్తే.. దర్శకుడికి.. బంజారాహిల్స్ రోడ్ నెంబరు9లో నివాసం ఉంటే కలప వ్యాపారి కృష్ణారావులకు మధ్య ఒక ఇంటికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 7వ తేదీన ఫిలింనగర్ సాయిబాబా గుడి నుంచి బంజారాహిల్స్ వెళుతున్న కృష్ణారావును విక్కీ అనే వ్యక్తి ఆపి.. దర్శకుడు తేజతో ఉన్న వివాదాన్ని త్వరగా సెటిల్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇష్యూను సెటిల్ చేసుకోని పక్షంలో వడ్డెర సత్యం.. కైసర్ గ్యాంగ్ లు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఈ నెల 13న కూడా దర్శకుడు తేజ ఫోన్ చేసి వ్యాపారిని హెచ్చరించినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇలా వరుసగా తనకు వస్తున్న బెదిరింపులతో సదరు వ్యాపారి కృష్ణారావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన పిర్యాదు.. ఆధారాలతో పోలీసులు దర్శకుడు తేజ.. వడ్డెర సత్యం.. కైసర్ గ్యాంగ్ లమీద క్రిమినల్ కేసు నమోదు చేశారు.