నాలుగు సినిమాలొచ్చాయి ఏం లాభం?

Update: 2015-12-19 17:30 GMT
ఇయర్ ఎండింగ్ లో సినిమాలు వరదలా వచ్చేస్తున్నాయి. కానీ అందులో ఆకట్టుకుంటున్నవి చాలా చాలా తక్కువ. ఈ నెలలో ‘బెంగాల్ టైగర్’ మాత్రమే ఓ మోస్తరుగా మెప్పించింది. దానికి ముందు వారం వచ్చిన ‘శంకరాభరణం’ నిరాశ పరిచింది. ఇక ఈ వారం నాలుగు సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతున్నాయి కానీ అందులో ఒక్కటీ పూర్తి సంతృప్తినిచ్చే సినిమా కాదు.

ఈ గురువారం విడుదలైన పూరి జగన్నాథ్-వరుణ్ తేజ్ ల ‘లోఫర్’ ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకు తొలి రోజే కంప్లీట్ నెగెటివ్ టాక్ వచ్చింది. తర్వాతి రోజు ఒకటికి మూడు సినిమాలు రిలీజయ్యాయి. ఆ మూడు కూడా వేరే భాషల చిత్రాలే. అందులో రెండు తెలుగులోకి కూడా వచ్చాయి. ఒకటి ధనుష్-సమంతల ‘నవ మన్మథుడు’ కాగా.. ఇంకోటి సంజయ్ లీలా బన్సాలీ ‘బాజీరావు మస్తానీ’. ఈ రెండూ కూడా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిలయ్యాయి.

బాజీరావు మస్తానీ ఆర్ట్ సినిమాలా ఉందని అంటుంటే.. ‘నవ మన్మథుడు’ కొంత వరకు ఎంటర్ టైన్ చేసి, మిగతాదంతా సీరియల్ తరహాలో సాగుతుందని చెబుతున్నారు. ఇక బాలీవుడ్ ఎవర్ గ్రీన్ పెయిర్ షారుఖ్ - కాజోల్ నటించారు కాబట్టి తెలుగులో అనువాదం కాకున్నా ‘దిల్ వాలే’పై ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. కానీ అందులో షారుఖ్ పెర్ఫామెన్స్ మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదట. సినిమాకు చాలావరకు నెగెటివ్ టాక్ వస్తోంది. మొత్తానికి ఈ వారం చెప్పుకోవడానికి నాలుగు సినిమాలైతే వచ్చాయి కానీ.. ఏదీ కూడా జనాల్ని పూర్తిగా మెప్పించలేకపోయింది.
Tags:    

Similar News