#MaaElections: మ్యానిఫెస్టో ప్రకటించి.. తప్పుకున్న సీవీఎల్‌

Update: 2021-10-02 08:22 GMT
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. నామినేషన్ లు వేసి ఎన్నికల వేడిని పుట్టించిన బండ్ల గణేష్‌ అనూహ్యంగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఇక అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు మరియు ప్రకాష్‌ రాజ్ లతో పాటు సీనియర్ నటుడు సీవీఎల్ కూడా ఢీ కొట్టేందుకు సిద్దం అయ్యాడు. సీవీఎల్ నామినేషన్ కూడా వేయడం జరిగింది. నేడు ఉదయం తన మ్యానిఫెస్టోను ప్రకటించి పలు కీలక అంశాల పట్ల తనకు ఉన్న అవగాహణ వెళ్లడించడంతో పాటు తాను అధ్యక్షుడిని అయితే పేద కళాకారుల కోసం ఖచ్చితంగా మంచి చేస్తాను అనే నమ్మకంను కలిగించాడు. మ్యానిఫెస్టో గురించి చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లుగా సీవీఎల్‌ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఉదయమే నేను మానిఫెస్టోను ప్రకటించాను. ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి కారణం ఉంది. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం. మా సభ్యుల సంక్షేమం కోసం నేను నా నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న రెండు ప్యానల్స్ లో నేను ఏ ఒక్కరికి కూడా మద్దతు ఇవ్వడం లేదు. నామినేషన్‌ ఉపసంహరించుకోవడానికి గల కారణం ఏంటీ అనే విషయాన్ని నేను త్వరలోనే చెప్తాను అంటూ సీవీఎల్‌ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉపసంహరణ వెనుక ఉద్దేశ్యం ఏంటీ అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో మాట్‌ టాపిక్.

మా సభ్యులందరికి కూడా అవకాశాలు వచ్చేలా చేస్తాను అంటూ హామీ ఇచ్చిన సీవీఎల్‌ ఉన్నట్లుండి తప్పుకోవడం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పలువురు సీవీఎల్‌ మ్యానిఫెస్టో పై ప్రశంసలు కురిపించారు. అంతలోనే ఇలా జరగడం విడ్డూరంగా ఉంది. సీవీఎల్ తప్పుకోవడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ ల మద్య పోటీ తీవ్రంగా ఉండబోతుంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికర విషయం.
Tags:    

Similar News