'ఢీ' డాన్సింగ్ కాంపిటీషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓ టీవీలో పెద్ద హిట్ షో గా నిలిచింది. ఎంతో మంది డాన్సర్లని 'ఢీ 'వెలుగులోకి తెచ్చింది. తద్వారా సినిమాలకు పనిచేసే అవకాశం దక్కించుకుంటున్నారు. ఆరకమైన ప్రతిభావంతులకు 'ఢీ 'మంచి వేదికగా నిలిచింది. ఇప్పటికే 14 సీజన్లను దిగ్విజయంగా ముగించుకుని 15వ సీజన్ లోకి అడుగు పెట్టింది.
ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకు ఇండియన్ మైఖెల్ జాక్సన్...దర్శకుడు..నుటుడ ప్రభుదేవా ముఖ్య అథిదిగా విచ్చేసారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.' వ్యాఖ్యాత ప్రదీప్ చెప్పినట్లు ఇంటి పెద్దన్నయ్య విదేశాలు అన్ని తిరిగి నాకు నిజంగానే సొంత ఇంటికి చేరుకున్నట్లే అనిపిస్తుంది. నా పొలంలో మొలకలు వచ్చినట్లు అనిపిస్తుంది.
'ఢీ' షోలో డాన్సర్లు అందరూ చాలా బాగా చేస్తున్నారు. వాళ్లని చూస్తుంటే నాకు కూడా పోటీ దారుడిగా మారిపోవాలని ఉంది. కానీ మొదటి రౌండ్లో నేను ఓడిపోతాను అని నాకు తెలుసు. మీరంతా చాలా డెంజరస్ డాన్సర్లు. మీతో నేను పోటీ పడలేను. నేను ముందే వచ్చేశాను. అందుకే ఇక్కడ కూర్చోబెట్టారు. నా తర్వాతే మీరంతా పుట్టినందకు థాంక్స్' అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు.
ఆయన వ్యాఖ్యలు పోటీదారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ప్రభుదేవా నిరాడంబరతని చూసి డాన్సర్లు అంతా షాక్ అయ్యారు. ఆయన అంత పెద్ద డాన్సర్..దర్శకుడు ఎలాంటి తారతమ్యం లేకుండా తమతో పాటే సమానంగా భావించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు.
ప్రస్తుతం ప్రభుదేవా వరుసగా బాలీవుడ్ లో సినిమాలు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా గతేడాది 'రాధే'తో భారీ హిట్ అందుకున్నారు. మళ్లీ ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అయితే బాలీవుడ్ నటులంతా తెలుగు మార్కెట్ పై కన్నేసిన నేపథ్యంలో ప్రభుదేవా మళ్లీ టాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఆయనకు మొదటి దర్శకుడిగా అవకాశం కల్పించింది తెలుగు పరిశ్రమనే. 'నువ్వొస్తానంటే నేనొదంటానా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యయారు. ఆ తర్వాత 'పౌర్ణమి' సహా పలు సినిమాలకు పనిచేసి బాలీవుడ్ కి వెళ్లిపోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.