మొన్న దక్ష.. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్.. ఒక విషయంలో మాత్రం పదే పదే ఒకటే మిస్టేక్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ చూడట్లేదని అనుకుంటున్నారో లేకపోతే వారికి ఏమీ గుర్తుండదని అనుకుంటున్నారో తెలియదు కాని.. ఇద్దరూ కూడా తమ డెబ్యూ తెలుగు సినిమాల గురించి మాత్రం కత్రినా కైఫ్ రేంజులో సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారులే. లెటజ్ సీ.
తేజ తీసిన ప్రేమ కథ ''హోరా హోరీ'' సినిమాలో దక్ష నాగర్కర్ అనే మరాఠి భామ హీరోయిన్ గా నటించింది. అమ్మడు ఆ సినిమాతో తన డెబ్యూ అని, తేజ గారి డైరక్షన్ లో తెరంగేట్రం చేసినందుకు ఫుల్ ఖుషీ అనీ చెప్పుకొచ్చింది. బాగానే ఉంది. అయితే అంతకంటే ముందే అమ్మడు కమెడియన్ ధనరాజ్ పక్కన ''ఏకె రావ్ పీకె రావ్'' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. అప్పట్లో ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు నడుం వయ్యారాలు వడ్డిస్తూ విచ్చేయడంతో ఈ బంగారం మీడియా కళ్ళలో పడింది. మరి అన్నీ తెలిసి, ఇప్పుడు హోరా హోరీ ఈజ్ మై డెబ్యూ అంటే ఎలాగమ్మా?
ఇకపోతే ''కంచె'' సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఉంది చూశారూ.. ఆమె కూడా అంతే. ఎవరికన్నా ఆమె ''మిర్చిలాంటి కుర్రాడు'' అనే సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ గా చేసి తెలుగు తెరకు పరిచయం ఎప్పుడో అయ్యింది కదా అనే విషయం తెలిస్తే ఓకె, లేకపోతే మాత్రం వరుణ్ తేజ్ సినిమానే నా తొలి మూవీ అని చెప్పేస్తోంది. నిన్న కంచె సినిమాను ప్రమోట్ చేస్తూ అమ్మడు అలా తన డెబ్యూ ను కవర్ చేసి.. ఈ కంచె తన ఫస్ట్ తెలుగు సినిమా అంటూ కలరింగ్ ఇచ్చిందిలే. అసలు ఈ కవరింగులు ఎందుకు భామలూ? ఆ సినిమాల గురించి చెబితే నష్టమేముంది?