ఇందిరమ్మగా దంగల్ గర్ల్

Update: 2022-06-15 02:30 GMT
దంగల్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న టాలెంటెడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ ఆ తరువాత అదే తరహాలో మరి కొన్ని విభిన్నమైన పాత్రలు చేసి సినిమా ప్రపంచంలో బిజీ యాక్టర్ గా మారిపోయింది. అయితే ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికి కూడా పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు.

ఇక తన టాలెంట్ తో ఫాతిమా మరికొన్ని ముఖ్యమైన పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇక రీసెంట్ గా ఆమెకు ఇందిరాగాంధీ పాత్రల్లో నటించే అవకాశం లభించినట్లు సమాచారం. "మోడరన్ లవ్ ముంబై" తో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న తరువాత ఫాతిమా సనా షేక్  శామ్ బహదూర్ పై దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉంది.  

అందులో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అంతేకాకుండా చాలా మంది సినీ ప్రముఖులు ఇంతకు ముందే ఈ కథను తెరపైకి తీసుకురావాలని కూడా ప్రయత్నాలు చేశారు.

కానీ ఫైనల్ గా మేఘన వెండితెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అయితే ఎంతో ముఖ్యమైన ఇందిరా గాంధీ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయంలో ఇటీవల అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

అయితే ఫైనల్ గా దంగల్ ద్వారా మంచి గుర్తింపును అందుకున్న టాలెంటెడ్ నటి ఫాతిమా సనా షేక్ అయితే ఆమె పాత్రకు న్యాయం చేయగలరు అని చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ పాత్రకోసం ఫాతిమా చాలా హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టులో ఇందిరాగాంధీ పాత్ర కోసం ఆమె ముందుగానే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అసలు ఆమె ఎలా ఉండేవారు అనే విషయంలో కూడా అవగాహన రావడానికి కొన్ని పాత వీడియోలను కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ పాత్రతో ఫాతిమా సనా షేక్ మళ్లీ తన స్థాయిని పెంచుకోవాలని చూస్తోంది. మరి ఈ ప్రాజెక్టు ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News