ఫస్ట్ లుక్: రజనీ పోలీస్ 'దర్బార్'

Update: 2019-04-09 04:46 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కళ్లు అటువైపే ఉంటాయి. ఈసారి తలైవా ఎలాంటి కథను ఎంచుకుంటున్నారు? దర్శకుడెవరు? టైటిల్ ఏంటి? కథేంటి? ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటి? అంటూ ఉత్కంఠగా మాట్లాడుకుంటారు. రజనీ నటించిన గత చిత్రాలు కబాలి - కాలా - 2.0 - పేట ఇలా  ప్రతిదీ అభిమానుల సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర డిబేట్ కి తావిచ్చాయి. రజనీ మానియాకు జయాపజయాలతో సంబంధం లేదని నిరూపణ అయ్యింది. సంక్రాంతి బరిలో పేట (పేట్ట) చిత్రంతో సూపర్ స్టార్ రజనీకాంత్ తిరిగి బంపర్ హిట్ కొట్టారని తమిళ క్రిటిక్స్ ప్రశంసించారు. తిరిగి పాత రజనీని చూడగలిగామని అభిమానులు సంతోషించారని మీడియా పొగిడేసింది.

పేట తర్వాత రజనీ కాంత్ జాతీయ అవార్డు గ్రహీత ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు అనగానే ఎంతో ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వేడి పెంచుతున్నాయి. ఇటీవలే తలైవా లుక్ ఇదీ అంటూ డమ్మీ లుక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. రజనీ లుక్ బావుంది అంటూ ప్రశంసలు దక్కాయి. అయితే అది ఒరిజినల్ కాదు. తాజాగా రజనీకాంత్ ఫస్ట్ లుక్ రిలీజైంది. టైటిల్ ని మురుగదాస్ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించారు. దర్భార్ అనేది టైటిల్. రజనీకాంత్ నటిస్తున్న 167వ చిత్రమిది. అయితే `కాలా` ఫస్ట్ లుక్ ని దర్శకుడు పా. రంజిత్ ఎలా డిజైన్ చేయించాడో అదే విధంగా మురుగదాస్ `దర్బార్` ఫస్ట్ లుక్ ని డిజైన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో  రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. బుధవారం నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ముంబాయిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ముంబాయిలో భారీ సెట్ ను డిజైన్ చేశారు. అక్కడే 30 రోజుల పాటు కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేశారట.  ఈ చిత్రం కోసం రజనీపై చేసిన ఫొటోషూట్ లీకైన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న చిత్ర బృందం పక్కాగా ప్లాన్ చేసి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.
   

Tags:    

Similar News