రామానాయుడు తెలుగు సినిమాకు నిర్మాణ విలువలు నేర్పించిన కార్యశూరుడు. నిర్మాత అంటే డబ్బులు పెట్టేవారు కాదు .. అడుగడుగునా కథలో భాగమయ్యేవారు అని నిరూపించిన ఘనుడు. 1960 నాటికి తెలుగు సినిమా అనేక మార్పులకు లోనవుతూ వచ్చింది.
అప్పటికే తెలుగు తెరపై జానపదాలు ... పౌరాణికాలు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. సహజత్వానికి అద్దం పడుతూ ముందుకు సాగుతున్నాయి. అలాంటి సమయంలోనే నిర్మాతగా రామానాయుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో ఓ భూస్వామి ఇంట రామానాయుడు జన్మించారు.
ఆరంభంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఆయన ఆ తరువాత సినిమా రంగంపై దృష్టి పెట్టారు. నిర్మాతగా సినిమాలు చేయాలనే ఆలోచనను తన తండ్రితో చెప్పారు. సినిమాలపై సదభిప్రాయం లేని ఆయన అందుకు అంగీకరించలేదు.
అయితే తాను ఎలాంటి వ్యసనాల జోలికి వెళ్లనని తండ్రికి మాట ఇచ్చిన రామానాయుడు, మద్రాసుకు చేరుకున్నారు. ముందుగా 'అనురాగం' అనే సినిమాకి భాగస్వామిగా ఉన్న ఆయన, ఆ తరువాత సురేశ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు భీముడు' సినిమాను నిర్మించారు.
ఎన్టీఆర్ తో తొలి హిట్ ను అందుకున్న ఆయన, ఆ తరువాత 'శ్రీకృష్ణ తులాభారం' నిర్మించి ఆ సినిమాను ఆణిముత్యాల వంటి సినిమాల జాబితాలో చేర్చారు. ఏఎన్నార్ తో 'ప్రేమనగర్' .. 'సెక్రెటరీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు.
ఆ తరువాత శోభన్ బాబుతో 'సోగ్గాడు' .. 'దేవత' వంటి సూపర్ హిట్లు ఇచ్చారు. ఇక కృష్ణ - శోభన్ బాబులతో మల్టీ స్టారర్ లను తీసి అభిమానులను మెప్పించారు. ఇలా వరుస విజయాలతో రామానాయుడి ప్రయాణం కొనసాగింది.
ఏ వర్గం ప్రేక్షకులు సినిమాల నుంచి ఏం ఆశిస్తారు? అన్నివర్గాల ప్రేక్షకులను అలరించాలంటే ఏయే అంశాలు ఉండాలి? అనే విషయాలను ఆయన పరిశీలించారు.
అలాగే ఏ హీరోకి ఎలాంటి ఇమేజ్ ఉంది? వాళ్లతో ఎలాంటి కథలు చేస్తే బాగుంటుంది? అనే అవగాహనను పెంచుకుంటూ వెళ్లారు. ఒక సినిమా అనేది ఎక్కువ కాలం థియేటర్లో ఉండాలే తప్ప సెట్స్ పై ఉండకూడదనే విషయం ఆయన బోధపడింది. అందువలన ఆయన సాధ్యమైనంత త్వరగా తన సినిమాలను పూర్తిచేసి వదిలేవారు.
అనుకోకుండా ఏదైనా అంతరాయం ఏర్పడితే, ఆ రోజున షూటింగు ఆగిపోకుండా ప్లాన్ Bని ఆచరణలో పెట్టడమనేది ఆయన నేర్చుకున్నారు. క్వాలిటీ దెబ్బతినకుండా ఎక్కడ ఎంతవరకూ ఖర్చు తగ్గించవచ్చు అనే విషయంపై ఆయన గట్టిగానే కసరత్తు చేసేవారు. రచయితలతో కూర్చుని కథాకథనాలపై చర్చలు జరిపేవారు.
అలానే ఏ పాత్రకి ఎవరు నప్పుతారు అనే విషయంలో తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేవారు. ఇక ఏ కథకైనా పాటలు ప్రాణమని నమ్మే నిర్మాత ఆయన. అందువలన పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. అందువలన ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలు చాలా వరకూ మ్యూజికల్ హిట్ గా కనిపిస్తాయి.
రామానాయుడు అంటే ఒక పద్ధతి. తాను పెట్టుకున్న నియమ నిబంధనలను తానే అతిక్రమించరు. ప్రతి పని కాలంతో ముడిపడి ఉంటుంది .. అనుకున్న పనిని సమయానికి పూర్తి చేయడమే అసలైన సక్సెస్ అని భావించేవారు. తన ఆశయానికి తగినట్టుగానే వివిధ భాషల్లో సినిమాలను నిర్మించారు. ఎంతోమంది నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
హీరోగా వెంకటేశ్ ను .. నిర్మాతగా సురేశ్ బాబును సక్సెస్ చేశారు. సినిమా నిర్మాణ రంగంలో సురేశ్ ప్రొడక్షన్స్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. రఘుపతి వెంకయ్య .. పద్మభూషణ్ .. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలను అందుకున్నారు. ఆ కృషి రుషి వర్ధంతి నేడు .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.