నాని.. కీర్తి సురేష్ జంటగా నటించిన 'దసరా' సినిమా ను ఈనెల 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా యొక్క కంటెంట్ అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
ఇప్పటి వరకు తెలుగు లోనే దసరా ప్రమోషన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు పాన్ ఇండియా ప్రమోషన్ ను దసరా టీమ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. సినిమా యొక్క ట్రైలర్ ను ఉత్తర భారతదేశంలో విడుదల చేయడం ద్వారా అక్కడ భారీ గా పబ్లిసిటీ దక్కేలా ప్లాన్ చేశారు.
దసరా యూనిట్ సభ్యులు ముంబాయి లో ఒక భారీ ఈవెంట్ కు ప్లాన్ చేశారు. ఆ తర్వాత లక్నో లో కూడా ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. లక్నో లో అన్ని భాషలకు చెందిన ట్రైలర్ లను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ట్రైలర్ ఈవెంట్ కోసం ముంబయి మరియు లక్నో లో వేదికలు రెడీ అవుతున్నాయి. అతి త్వరలోనే ఒక అఫిషియల్ పోస్టర్ ను విడుదల చేసి అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న దసరా సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఉత్తర భారతంలో కూడా దసరా సినిమా యొక్క బజ్ పెంచాలి అంటే కాస్త ఎక్కువగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక ట్రైలర్ విడుదల చేయడంతో పాటు ప్రత్యేక ఈవెంట్స్ ను అక్కడ ప్లాన్ చేయడం ద్వారా కచ్చితంగా హిందీ ప్రేక్షకుల్లో దసరా పై ఆసక్తి కలిగే అవకాశం ఉంది. సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా మాస్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కనుక దసరా కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకుంటే కచ్చితంగా భారీగా హిందీ లో వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.