జీవితంలో ఉన్నంత నాటకీయత మరెక్కడా కనిపించదేమో. కొన్ని అంశాల్ని చూస్తే.. కాస్త సిత్రంగా అనిపించక మానదు. ఎంతోమందికి సినిమా కెరీర్ ను అందించి.. ఉన్నత స్థానాల్లోకి వచ్చేందుకు దివంగత దర్శకరత్న దాసరి చేసిన ప్రయత్నాల్ని ఎవరూ మర్చిపోలేరు. ఆయన మరణం తెలుగు చలనచిత్రపరిశ్రమకు పెద్ద లోటుగా చెప్పొచ్చు. ఎంతో మందికి కెరీర్ ను ఇచ్చిన ఆయన.. తన కొడుకును మాత్రం స్టార్ గా చూసుకోలేకపోయారు.
తన కొడుకును సినిమాల్లో ఎదగాలని ఆయన బాగా అనుకునేవారట. నీ కెరీర్ పుంజుకుంటే బాగుంటుందని తన తండ్రి తనతో అన్నట్లుగా దాసరి కుమారుడు దాసరి అరుణ్ కుమార్ చెప్పారు. తన తండ్రి మరణం తమ ఫ్యామిలీకి తీరని లోటుగా అభివర్ణించిన అరుణ్.. ఇలా జరుగుతుందని తాము అస్సలు అనుకోలేదన్నారు.
సినిమాలు చెయ్యరా అని ఆయన పదే పదే చెప్పేవారని.. కానీ తనకే ఇంట్రస్ట్ లేక పెద్దగా దృష్టి పెట్టలేదని అరుణ్ చెప్పారు. తన తండ్రికోసం.. ఆయన ఇష్టం కోసం ఇకపై సినిమాలు చేయాలని తాను నిర్ణయించుకున్న విషయాన్ని వెల్లడించారు.
"ఆయన ఉన్నంత కాలం ఏమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు నాన్న ఇష్టాన్ని తీర్చాలన్న సెంటిమెంట్ బలపడింది. ఇక నుంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. పాత్ర ఏదైనా సరే.. చివరకు విలన్ గా అయినా సరే చేసేందుకు సిద్ధం" అంటూ తన మనసులోని మాట చెప్పారు దాసరి అరుణ్ కుమార్. తండ్రి కోర్కెను అరుణ్ కుమార్ ఎంతవరకు తీరుస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/