టాలీవుడ్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా చెప్పే స్వర్గీయ దాసరి నారాయణరావు కుటుంబానికి ఒక లోటు ఉందని చెబుతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానానికి వారసుడిగా ఆయన కొడుకు అరుణ్ కుమార్ కంటిన్యూ చేయలేకపోయారని చెబుతారు.
కొన్నేళ్ల క్రితం అరుణ్ కుమార్ ను గ్రీకువీరుడిగా భారీ ఎత్తున లాంఛ్ చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. తనకున్న పరపతితో కొన్ని ప్రయత్నాలు చేసినా అరుణ్ కు మాత్రం వర్క్ వుట్ కాలేదు. దీంతో.. ఆయన సినిమాల్ని వదిలేసి బిజినెస్ లమీద దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేశారు దాసరి అరుణ్.
వరుస ఎదురుదెబ్బల తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మొత్తంగా మార్చేస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు గోపీచంద్.. జగపతిబాబు.. ఆది పినిశెట్టి.
ఈ సెంటిమెంట్ ను కొనసాగింపుగా దాసరి అరుణ్ నిలుస్తారా? లేదా? అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ఇప్పుడో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి పోతావు చిన్నదానా లాంటి హిట్ మూవీ దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి తాజాగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో దాసరి అరుణ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. క్రిస్ మస్ కు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీతో అయినా దాసరి అరుణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.