సినీ పాత్రికేయ సంఘాల నాయ‌కుల‌కు దాస‌రి పుర‌స్కారాలు

Update: 2022-05-04 06:36 GMT
డైరెక్ట‌ర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటూ ద‌ర్శ‌కుడు అనే ప‌దానికి వ‌న్నె తెచ్చిన వ్య‌క్తి ద‌ర్శ‌క‌ర‌త్న డా. దాస‌రి నారాయ‌ణ‌రావు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న కెరీర్ లో ఎన్నో మ‌ర‌పురాని చిత్రాల‌ని అందించారు. ద‌ర్శ‌క శిఖ‌రంగా పేరు తెచ్చుకున్న ఆయ‌న 75వ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని దాసరి ఫిల్మ్ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్నిఅత్యంత ఘ‌నంగా నిర్వ‌హించారు.

శ‌తాధిక చిత్రాల నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ సార‌థ్యంలో జ‌రిగిన ఈ వేడుక‌లో సినీ పాత్రికేయ సంఘాల నాయ‌కుల‌ను ప్ర‌త్యేకంగా స‌త్క‌రించారు.

తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎమ్‌. లక్ష్మీ నారాయ‌ణ‌, కోశాధికారి హేమ‌సుంద‌ర్‌, తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు వి. ల‌క్ష్మీ నారాయ‌ణ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వై.జే. రాంబాబు, ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు, తెలుగు ఫిల్మ్ వ‌ర్కింగ్ ఫొటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ఎమ్‌.ఎన్‌. భూష‌ణ్‌, కార్య‌ద‌ర్శులు వాసు సజ్జా, కోశాధికారి సీఎం ప్ర‌వీణ్ కుమార్ ల‌కు జ్ఞాపిక‌ల‌ని అందించి శాలువాల‌తో ప్ర‌త్యేకంగా స‌త్క‌రించారు.  

ఈ సంద‌ర్భంగా దాసరితో త‌మ‌కున్న అనుబంధాన్ని జ‌ర్నిలిస్ట్ లు గుర్తు చేసుకుని నిర్వాహ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఇదే వేదిక‌పై ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు దాస‌రి జీవిత‌కాల సాఫ‌ల్య‌తా పుర‌స్కారాల‌ని అందించిన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని 24 క్రాఫ్ట్ ల సంఘాల ప్రెసిడెంట్‌, సెక్ర‌ట‌రీ,  ట్రెజ‌ర‌ర్ ల‌ను స‌న్మానించారు.
       
ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ నిర్మాత‌లు సి. అశ్వ‌నీద‌త్‌, జి. ఆదిశేష‌గిరిరావు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, టి. ప్ర‌స‌న్న‌కుమార్‌, సి. క‌ల్యాణ్‌, కె.ఎల్ . దామోద‌ర ప్ర‌సాద్‌, కె. అచ్చిరెడ్డి, ఎస్‌.వి. కృష్ణారెడ్డి, అంబికా కృష్ణ‌, ద‌ర్శ‌కుడు ధ‌వ‌ళ స‌త్యం, రేలంగి న‌ర‌సింహారావు, హీరో సుమ‌న్‌, సీనియ‌ర్ రైట‌ర్స్ స‌త్యానంద్‌, రాజేంద్ర కుమార్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News