రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ వంగవీటి.. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ సినిమాకి అటు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. కీలకమైన రంగా పాత్రను తక్కువ చేసి చూపారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రంగా సామాజిక వర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సినిమా విడుదలయినప్పటి నుంచి ఈయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారట. కనీసం మొబైల్ లో కూడా అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. రంగా పాత్రను తెరకెక్కించిన తీరుపై తన సొంత సామాజిక వర్గం నుంచే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావిస్తున్నారట ఆయన. అయితే.. సినిమా ఔట్ పుట్ ఇలా ఉండడంలో ఆయన పాత్ర ఏమీ లేదని సన్నిహితులు చెబుతున్నారు.
ముందుగా ఈయనకు నేరేట్ చేసిన విధానం వేరని.. ఇప్పుడు ఆన్ స్క్రీన్ పై కనిపిస్తున్న సినిమా వేరని చెబుతున్నారట. కనీసం ఫైనల్ కట్ ను తనకు చూపించలేదని చెబుతున్నారట దాసరి. ఈ వివాదం సద్దుమణిగేవరకూ.. అప్రమత్తంగా ఉండడమే ఉత్తమమని భావిస్తున్నారట ఈ నిర్మాత.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/