మొన్నటికి మొన్న సంతోషం సినిమా అవార్డుల వేడుకలో పెద్దాయన దాసరి నారాయణరావు చాలానే చురకలు వేశారు. ఈ కార్యక్రమంలో బాహుబలి హీరో ప్రభాస్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు - అలాగే విలన్ రానాకు బెస్ట్ విలన్ అవార్డు వచ్చిన సందర్భంలో.. దాసరి వారు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు తమను పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చారు.
సినిమా పరిశ్రమకు అవార్డులు ఇచ్చి ప్రోత్సాహించాల్సి ఉంటుందని.. అప్పుడే కళాకారులు ఆనందపడతారని చెప్పిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవార్డులు విషయంలో జాప్యం చేస్తుందని అన్నారు. అవును - తెలుగు రాష్ట్రాలు విడిపోయాక అసలు సినిమావాళ్ళకు అవార్డులే ఇవ్వట్లేదు. టాలీవుడ్ కేంద్రంగా ఉన్న తెలంగాణలో అయితే ఇంతవరకు కొత్త అవార్డుల ప్రస్తావనే రాలేదు. బహుశా అవార్డులు ఇస్తే అవి తెలంగాణ సినిమాలకే ఇవ్వాలని ఎవరన్నా గొడవ చేస్తారనేమో తెలియదు కాని.. ఎందుకో సినిమా ఇండస్ర్టీతో చాలా క్లోజ్ టైస్ మెయిన్టయిన్ చేసే తెలంగాణ మంత్రులు కూడా ఈ విషయంలో ఇంకా ఏమి డిసైడ్ కాలేదు. ఇక క్యాపిటల్ సిటీయే లేనప్పుడు అవార్డుల ఉత్సవాలు ఏం చేస్తారు ఆంధ్ర ప్రభుత్వం వారు. అందుకే వాళ్ళనీ ఏమీ అనలేం.
మొత్తానికి పెద్దాయన చురకలు ఎలా ఉన్నా కూడా.. దాసరి వారు ఈ కామెంట్లు చేస్తుంటే అప్పట్లో ఆయనకు 'మేస్ర్తి' అనే సినిమాకు ఉత్తమ నటుడి అవార్డును ఇవ్వడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ గుర్తొచ్చింది. ఎక్కడ అవార్డు ఫంక్షన్లు మొదలెడితే మళ్లీ లాబీయింగులను ఎంటర్టయిన్ చేయాల్సి వస్తుందేమో అని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను జరపట్లేదేమో సార్!!