దర్శకరత్న దాసరి నారాయణరావు స్టైలే వేరు. ఆయన మనస్సులో ఉన్నది ఉన్నట్టు కుంటబద్దలు కొట్టేస్తారు. దాసరి ఇప్పటి వరకు టాప్ హీరోల పై ముఖ్యంగా మెగా కుటుంబం పై పలు ఫంక్షన్లలో సెటైర్లు వేయడం చూశాం. అయితే ఆయన తన రూటు మార్చి ఈ సారి ఎందుకో గాని పూరి జగన్నాథ్ ను టార్గెట్ గా చేసుకుని భారీ పంచ్ లు విసిరారు. ఇటీవల సంపూర్ణేష్ బాబు హీరోగా నటించే.. 'కొబ్బరి మట్ట' షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా దాసరి ఈ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు.
సినిమాలో ఒకప్పుడు హీరో అంటే మంచివాడు... తల్లిదండ్రులను గౌరవించేవాడు... ఊరికి మంచి చేసేవాడు అన్న పంథాలో హీరో క్యారెక్టర్ ఉండేదని... ఏ ముహూర్తాన పూరి జగన్నాథ్ 'ఇడియట్' సినిమా తీశాడోగానీ అప్పటి నుంచి హీరోకి అర్థం మారి పోయిందన్నారు దాసరి. తల్లిదండ్రుల గురించి వెటకారంగా మాట్లాడేవాడు, లవర్ ని రోడ్డుపై ఏడిపించేవాడు సెటైర్లతో పంచ్ డైలాగ్స్ వేసేవాడు ఈ రోజు హీరోగా మారిపోవడం దురదృష్టకరమని దాసరి విమర్శించారు.
పూరి సినిమాల ప్రభావంతో నేటి యూత్ కూడా హీరో అంటే ఇలాగే ఉండాలి అన్న అభిప్రాయానికి వచ్చేశారన్నాడు. ఆ.. మధ్య టెంపర్ సినిమా చూసిన దాసరి పూరిని ఆకాశానికి ఎత్తేశారు.. పూరి నా వారసుడంటూ కీర్తించారు. అయితే ఇప్పుడు సడెన్ గా ఆయన రూటెందుకు మార్చారో అర్థం కావడం లేదు.
ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సంపూర్ణేష్ బాబు తన స్వశక్తితో హీరోగా రాణిస్తున్నాడంటూ దాసరి సంపూను ఆకాశానికెత్తేశారు.