సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు కొన్నేళ్లుగా డైరెక్షన్ కు దూరంగానే ఉంటున్నారు. సినిమా రంగానికి.. ముఖ్యంగా చిన్న సినిమాలకు అండగా ఉండేందుకు తన వాయిస్ వినిపించే దాసరి.. మళ్లీ దర్శకుడి పగ్గాలు చేపట్టబోతున్నారట. గత నెలలో మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు రెడీ అవుతున్నారాయన.
ఇప్పటికే రైటర్ల బృందం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో కూడా ఉండగా.. ఈ స్క్రిప్ట్ పూర్తి కాగానే మూవీని పట్టాలెక్కించేందుకు.. తనే దర్శకత్వం వహించేందుకు దాసరి సిద్ధమవుతున్నారు. నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరిస్తారని తెలుస్తోంది. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటుండగా.. 'అమ్మ'అనే టైటిల్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ టైటిల్ ను ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడం కూడా పూర్తయిపోగా.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట.
మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా దాసరి నిర్మాణంలో ఓ సినిమా ఉంటుందనే టాక్ చాలా నెలల నుంచే వినిపిస్తోంది కానీ.. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే.. కథను ఫైనలైజ్ చేసేందుకు దాసరి ప్రయత్నిస్తున్నారనే టాక్ మాత్రం వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/