రుద్రమదేవి సినిమా ఓ దృశ్య కావ్యం అని.. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదని.. ఈ సినిమాను ప్రమోట్ చేయాల్సిన బాధ్యత టాలీవుడ్లోని సీనియర్లందరి మీదా ఉందని దర్శక రత్న దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ‘రుద్రమదేవి’ గురించి మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
‘‘నాకు ఓ సినిమా నచ్చితే దాని గురించి ఎవరూ అడక్కపోయినా నా సీనియరిటీని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని అనుకుంటా. రుద్రమదేవి గురించి అందుకే మాట్లాడుతున్నా. ఆదివారం రాత్రి ‘రుద్రమదేవి’ సినిమా చూశాను. ఇది చాలా డేంజర్ జానర్. హిస్టారికల్ సినిమా తీయడం చాలా పెద్ద సాహసం. అల్లూరి సీతారామరాజు, తాండ్ర పాపారాయుడు తర్వాత తెలుగులో వచ్చిన తొలి చారిత్రక సినిమా రుద్రమదేవే. ఐతే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం చాలా పెద్ద సాహసం. కమర్షియాలిటీ పేరుతో ఏదేదో చేస్తున్నారు. నేనైతే ఈ రోజుల్లో రుద్రమదేవి లాంటి సాహసోపేత సినిమా చేసేవాణ్ని కాదు. మరి గుణశేఖర్ ఎందుకంత ధైర్యం చేశాడో తెలియదు. రుద్రమదేవి, కాకతీయ సామ్రాజ్యం గురించి చెప్పాలన్న మక్కువతోనే సినిమా చేసినట్లున్నాడు. ఈ సినిమాకు పెట్టుబడిదారులు లేరు. అయినా ఇంత భారీ సినిమా తీయడానికి పూనుకున్నాడు. చాలా ఏళ్లు కష్టపడ్డాడు. ఆ కష్టం అలాంటిలాంటిది కాదు. అది అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగా ఆడాలని కోరుకున్నారు.
‘రుద్రమదేవి’ సినిమాను గుణశేఖర్ ఓ దృశ్య కావ్యంలాగా తీశాడు. ఇందులో అతిశయోక్తి లేదు. అక్కడక్కడా కొంచెం కల్పితాలు ఉన్నప్పటికీ దాదాపుగా ఒరిజినల్ కథకే కట్టుబడ్డాడు. ఏ పాత్రా ఔచిత్యం దెబ్బతినకుండా చూసుకున్నాడు. ఈ సినిమా గురించి మాట్లాడ్డానికి నాకు నేనుగా ముందుకొచ్చా. గుణశేఖర్ ప్రెస్ మీట్ పెట్టమని అడగలా. ఇలాంటి సినిమా గురించి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత నామీద ఉందని భావించా. నాకే కాదు.. సీనియర్లందరికీ ఈ బాధ్యత ఉంది. ఈ సినిమాను అందరూ చూడాలి. జనాల కంటే ముందు ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు సినిమా చూసి తీరాలి. ఇలాంటి సినిమాలు ఎందుకు తీయాలో తెలుసుకోవాలి’’ అని దాసరి అన్నారు.