హీరోయిన్స్ కి దాసరి సీరియస్ సలహా!

Update: 2016-10-13 04:29 GMT
ఏది మాట్లాడినా ముక్కుసూటిగా ఉంటుంది.. ఎవరిగురించైనా ప్రత్యక్షంగానో పరోక్షంగా మాట్లాడినా అది నేరుగా వెళ్లి తగలాల్సిన వారికి తగులుతుంది. ఇది దాసరి నారాయణరావు స్టైల్! ఇండస్ట్రీకి పనికొచ్చే పెద్దమనిషిగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు తాజాగా హీరోయిన్లు - తెలుగు బాష పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. రోజు రోజుకీ తెలుగుదనం తగ్గిపోతున్న తెలుగు సినిమాపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలుగు సినిమా హీరోయిన్స్ కి ఒక సిన్సియర్ అండ్ సీరియస్ సలహా కూడా ఇచ్చారు దర్శకరత్న దాసరి.

"100 డిగ్రీ సెల్సియస్" సినిమా ఓపినింగ్ సందర్భంగా హీరోయిన్లు రాయ్‌ లక్ష్మీ - నికిషా పటేల్ - అరుంధతి నాయర్‌ లపై క్లాప్ ఇచ్చిన దాసరి అనంతరం మాట్లాడుతూ... "తెలుగు ఇండస్ట్రీ రాను రాను ఇంగ్లీష్ ఇండస్ట్రీ అయిపోయింది.. ఆర్టిస్టులందరూ ఇంగ్లీష్‌ లోనే మాట్లాడుతున్నారు.. ఇదే క్రమంలో టైటిళ్లు కూడా ఇంగ్లీష్‌ లోనే వేస్తున్నారు  భారతదేశంలోని అన్ని భాషల హీరోయిన్స్‌ ను తెలుగు ఇండస్ట్రీ గౌరవిస్తుంది.. కాబట్టి, హీరోయిన్స్ ముందు తెలుగు నేర్చుకొని ఇండస్ట్రీకి రావాలి.. ఇది నా సిన్సియర్ అండ్ సీరియస్ సలహా.. ఈ హీరోయిన్స్ అంతా నెక్ట్స్ నేనున్న స్టేజ్‌ పైకి వచ్చినప్పుడు కచ్చితంగా తెలుగులో మాట్లాడాలి.. అలా మాట్లాడకపోతే నేను వాకౌట్ చేస్తా" అని అన్నారు.

ఐదుగురు కథానాయికలతో సి.ఎల్‌.మీడియా తెలుగు - తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం "100 డిగ్రీ సెల్సియస్‌". మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌ లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత శోభారాణి గురించి మాట్లాడిన దాసరి... ఆమెకు సినిమాలంటే ఎంతో ప్యాషన్ అని - దాంతో ఎన్నో తమిళ సినిమాలు డబ్బింగ్ చేసి ఎంత డబ్బు పోగొట్టుకుందో తనకు తెలుసునని అన్నారు. "ఎందుకమ్మా అంత డబ్బు పెట్టి డబ్బింగ్ సినిమాలు కొనడం.. నువ్వే సొంతంగా ఒక సినిమా నిర్మించు" అని గతంలో శొభారాణితో అనగా నేడు ఒక మంచి కథతో సినిమా నిర్మిస్తుంది - అందుకు చాలా సంతోషంగా ఉంది అని దర్శకరత్న దాసరి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News