పెళ్లికి ముందు వేరొక అగ్ర హీరోయిన్ తో డేటింగ్?

Update: 2021-11-26 04:32 GMT
ప్రముఖ హీరో- హీరోయిన్ జంట‌ విడాకుల వార్త‌లు ఇటీవ‌ల సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్యా క‌ల‌త‌లు మొద‌లై ఎంత‌కాల‌మైందో కానీ.. కుటుంబ‌ పెద్ద‌లు క‌లిపే ప్ర‌య‌త్నం చేసారు.. కానీ ఎవ‌రి వ‌ల్లా కాలేదు. ఆ త‌ర‌వాత స‌ద‌రు హీరోపై హీరోయిన్ ర‌క‌ర‌కాలుగా సోష‌ల్ మీడియాల్లో కామెంట్ల‌ను పోస్ట్ చేయ‌డం తెలిసిందే.

``ప్రేమ ఆప్యాయ‌త కావాలి! కాస్త‌యినా ప్రేమ చూపించు! లాంటి వ్యాఖ్య‌ల‌తో ఆవేద‌న చెందుతూ స‌ద‌రు హీరోయిన్ వ్యాఖ్య‌లు పోస్ట్ చేయ‌డంపై క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. కెరీర్ ప‌రంగా బిజీ అయ్యారు.

అదంతా స‌రే కానీ.. తాజాగా ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ పోర్ట‌ల్ వెలువ‌రించిన క‌థ‌నం టాలీవుడ్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. దీని ప్ర‌కారం.. స‌ద‌రు హీరో త‌న మాజీ భార్య‌తో ప్రేమాయ‌ణం సాగించ‌డం కంటే ముందే వేరొక ప్ర‌ముఖ హీరోయిన్ తో ప్రేమ‌లో ప‌డ్డార‌ని ఆ ఇద్ద‌రూ సీరియ‌స్ గా డేటింగ్ కూడా చేశార‌ని క‌థ‌నాన్ని ప్ర‌చురించ‌డం వేడెక్కిస్తోంది. నిజానికి త‌న‌నే పెళ్లి చేసుకోవాల‌నుకున్నా ఇంత‌లోనే హీరోగారి రూట్ మారింది.

స‌ద‌రు క‌థ‌నం ఇప్పుడు ర‌క‌ర‌కాల డౌట్లు పుట్టించింది. అయితే ఇదంతా బాలీవుడ్ మీడియా గాసిప్పు మాత్ర‌మేనని ఆ హీరో అభిమానులు భావిస్తున్నారు. పెళ్లికి ముందు వేరొక అగ్ర హీరోయిన్ తో డేటింగ్ నిజ‌మా కాదా? అన్న‌ది అటుంచితే స‌ద‌రు అగ్ర‌ హీరోయిన్ అప్ప‌టికే వేరొక ప్ర‌ముఖ త‌మిళ హీరోతో నిండా ప్రేమ‌లో మునిగి బ్రేక‌ప్ అయ్యింది.

ఇటీవ‌ల ఓ విదేశీ బోయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయి స్వ‌దేశీ యువ‌కుడితో నిండా ల‌వ్ లో మునిగి ఉంది. ఈ జంట రొమాంటిక్ వేషాలు నెట్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


Tags:    

Similar News