బ్యూటిఫుల్ కృతి కర్బందా పేరు తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ భామ తెలుగులో 'తీన్ మార్'.. 'Mr. నూకయ్య'.. 'ఒంగోలు గిత్త'.. 'ఓం 3D'.. 'బ్రూస్ లీ' లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమధ్య బాలీవుడ్ లో సెటిల్ అయింది. అక్కడ వరసగా సినిమాలు చేస్తోంది. పనిలో పనిగా ఓ అందగాడిని వెతుక్కుని డేటింగ్ కూడా మొదలు పెట్టింది.
ఆ అందగాడు ఎవరంటే పుల్కిత్ సామ్రాట్. ఇద్దరికీ ప్రేమ వైఫై ఎక్కడ కనెక్ట్ అయిందంటే 'వీరె ది వెడ్డింగ్'.. 'పాగల్ పంటి' సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాల ఇద్దరిమధ్య ఫ్రీక్వెన్సీని ఫుల్లుగా ట్యూన్ చెయ్యడంతో ఇద్దరూ డేటింగ్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇప్పుడు లాక్ డౌన్ కదా.. మరి ప్రేమికులు ఏం చేస్తున్నారంటే చిలకాగోరింకాల్లాగా కలిసి మెలిసి.. మెలిసి కలిసిపోయి ఈ పాడు లోకానికి దూరంగా జంటగా సమయంగా గడుపుతున్నారు. లాక్ డౌన్ ను ఈ రకంగా వాడుకోవడం అంటే మాటలు కాదు. అది చేసి చూపిస్తోంది ఈ జంట.
ఈ లాక్ డౌన్ పై కృతి మాట్లాడుతూ "ఈ లాక్ డౌన్ లో ఒకే చోట లేని ఇతర జంటలు ఎలా కాలం గడుపుతున్నారో నేను ఊహించలేకపోతున్నాను. ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించేందుకు మేము ఇద్దరం ఒకే బిల్డింగ్ లో ఉండాలని గతంలో నిర్ణయించకున్నాము. అదే మాకు ఇప్పుడు ఓ వరంగా మారింది. ఇప్పుడు తను(పుల్కిత్) నాతో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ వివరించింది.
స్టోరీ అర్థం అయింది కదా. అప్పట్లో ట్రాఫిక్ బాధలు భరించలేక ఒకే అపార్ట్ మెంట్ లో ఉన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకు ఒకరి కౌగిలిలో మరొకరు బందీగా మారిపోయారు. అయినా మోడీ గారు చెప్పిన లాక్ డౌన్ ఏంటి.. ఈ లాక్ డౌన్ ఏంటి? ఆ రాగం ఈ తాళం ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి. ఈమధ్యే పుల్కిత్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా డాన్స్ చేస్తూ.. పియానో వాయిస్‌తో ఉన్న ఒక వీడియో ను పోస్ట్ చేశాడు. దీనర్థం "కరోనా మాత" ఈ జంటను మరీ దగ్గర చేసినట్టుందే.