వెండితెర సెక్స్ బాంబ్ షకీలా గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. కానీ.. 90లలోని యువతకు మాత్రం బాగా పరిచయం! సినిమా పేరు ఎవ్వరికీ అవసరం లేదు.. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనే విషయాలు అసలు నథింగ్! పోస్టర్ పై షకీలా బొమ్మ ఉందా లేదా! షకీలా సినిమా వచ్చిందంటే చాలు.. నాలుగు ఆటల్లో ఏదో ఒకదానికి టికెట్ తెగాల్సిందే అన్నట్టుగా ఉండేది పరిస్థితి! అది ఎంతగా అంటే.. తమిళనాట టాప్ హీరోలుగా ఉన్నవారు కూడా.. షకీలా సినిమా రిలీజ్ డేట్ తెలుసుకొని, తమ సినిమాలకు స్లాట్ బుక్ చేసుకునేవారు!
దాదాపు రెండు దశాబ్దాల పాటు వెండితర సెక్స్ క్వీన్ గా వెలుగొందారామె. ఆ తర్వాత సినిమాలకు క్రమంగా దూరమయ్యారు. ఈ మధ్యనే షకీలా బయోపిక్ కూడా వచ్చింది. కాగా.. ప్రస్తుతం తమిళ్ స్మాల్ స్క్రీన్ పై ప్రసారం అవుతున్న 'కుక్ విత్ కోమలి' అనే షోలో కంటిస్టెంట్ గా ఉన్నారు షకీలా. అయితే.. ఈ షోలోనే అందరికీ షాక్ ఇచ్చే విషయం చెప్పారు షకీలా! తనకు కూతురు ఉందని, ఆమె ఈమేనంటూ చూపించారు.
షకీలాకు పెళ్లికాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. పలుమార్లు ప్రేమలో విఫలమైన ఆమె.. వివాహానికి దూరంగా ఉన్నారు. అయితే.. సడెన్ గా పాతికేళ్ల అమ్మాయిని చూపించి ఈమే తన కూతురు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తన పేరు మిల్లా అని పరిచయం చేసింది షకీలా.
అయితే.. ఆమె తన సొంత కూతురు కాదని, దత్తత తీసుకున్నానని చెప్పారు. అంతేకాదు.. తనో ట్రాన్స్ జెండర్. ఆమెను పరిచయం చేసిన షకీలా భావోద్వేగానికి గురయ్యారు. మిల్లా చిన్న వయసులో ఉన్నప్పుడే అడాప్ట్ చేసుకున్నానని చెప్పారు. ఈ జీవితంలో తనకు నేను, నాకు తను అండగా ఉన్నామని ఎమోషనల్ అయ్యారు.