విజయ్ హవాకు కామ్రేడ్ బ్రేక్ వేస్తాడా?

Update: 2019-07-27 14:30 GMT
అనుకున్నదొక్కటి అయినదిఒక్కటి తరహాలో డియర్ కామ్రేడ్ విషయంలో ఏదేదో ఊహించుకున్న విజయ్ దేవరకొండకు వస్తున్న ఫలితం భిన్నంగా ఉంది. లవ్ స్టోరీని సోషల్ ఇష్యూతో లింక్ చేసిన తీరులో దర్శకుడు భరత్ కమ్మ బాలన్స్ తప్పడంతో ఇది అన్ని వర్గాలను మెప్పించలేకపోతోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే సీన్ ఇంకోలా ఉండేది.  కానీ జరగలేదు. ఇప్పుడు దీని ప్రభావం విజయ్ దేవరకొండ మార్కెట్ మీద అతని రాబోయే  సినిమాల మీద ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడు మొదటి ఒత్తిడి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్  బ్యానర్ మీద రూపొందుతున్న మూవీ మీద ఉంటుంది. ఇప్పటికే ముప్పాతిక శాతం పూర్తయ్యిందని తెలిసింది. మైత్రి తీస్తున్న మల్టీ లాంగ్వేజ్ మూవీ హీరో ఇప్పటికే నిర్మాణంలో ఉంది కానీ ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టినట్టుగా టాక్ ఉంది. నిర్మాతలు వాటిని కొట్టిపారేశారు. ఇవి కాకుండా గీత ఆర్ట్స్ సంస్థకు విజయ్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ఇంకా చర్చల దశలోనే ఉంది కాబట్టి పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉంది. అర్జున్ రెడ్డి -గీత గోవిందంతో మార్కెట్ అమాంతంగా పెంచుకున్న విజయ్ దేవరకొండ మీద డియర్ కామ్రేడ్ ఎఫెక్ట్ వల్ల రెమ్యునరేషన్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్.  

యూత్ లో ఎంత క్రేజ్ ఉన్నా బిసి సెంటర్స్ లో విజయ్ దేవరకొండ కు ఇంకా పట్టు రాలేదు. వాళ్లకు కావాల్సిన  అంశాలున్న సినిమాలు ఇంకా మొదలుపెట్టలేదు. బిజినెస్ విషయంలో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి తర్వాత వచ్చే సినిమాల పారితోషికంతో పాటు ఓపెనింగ్స్ లెక్కల్లో తేడాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఇదంతా ఊహించే డియర్ కామ్రేడ్ ను విజయ్ ఉదృతంగా  ప్రమోట్ చేసుకున్నాడనే మాట కూడా వినిపిస్తోంది.  ఏది ఎలా ఉన్నా స్క్రిప్ట్ ల విషయంలో ఇకపై ఇంకా జాగ్రత్త ఉండమనే హెచ్చరిక అయితే కామ్రేడ్ ఇచ్చాడు


Tags:    

Similar News