సినిమా వాళ్లను చూసి.. కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. కావాల్సినంత పేరుంది. ఇంకేం కావాలి అనుకుంటాం కానీ.. వాళ్ల సమస్యలు వాళ్లకుంటాయి. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే సంగతే తీసుకుంటే.. ఆమె కొన్నేళ్ల కిందట డిప్రెషన్ కారణంగా తీవ్ర మానసిక వేదన అనుభవించిన సంగతి ఈ మధ్యే వెల్లడైంది. ఆ సమయంలో తాను ఎంతగా ఒత్తిడికి గురయ్యానో ఓ ఇంటర్వ్యూలో చెబుతుంటే చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ కనిపించే దీపిక ఇంత వేదన అనుభవించిందా అనుకున్నారు.
తాజాగా ‘లివ్ లవ్ లాఫ్’ అనే తన స్వచ్ఛంద సంస్థ డిప్రెషన్ మీద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న దీపిక తన గతాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనై ఏడ్చేసింది. తాను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి పోయిన సందర్భాలు గుర్తు చేసుకొని.. ఆ సమయంలో తన తల్లిదండ్రులు.. సోదరి వెంట లేకుంటే తాను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాదంటూ గద్గద స్వరంతో చెప్పింది దీపిక. ‘‘పోటీ ప్రపంచంలో మనం దూసుకెళ్లాలి. కానీ ఈ రోజుల్లో అందరూ సున్నిత మనస్కులుగా మారుతున్న విషయం కూడా గుర్తించాలి. అలా మారకూడదు. మనం ఈ సమాజానికి చెందిన వాళ్లం కాదనే ఆలోచన అస్సలు రానీయకూడదు’’ అంటూ తనకు ఎదురైన అనుభవాల గురించి పరోక్షంగా చెప్పింది దీపిక.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/