దేశం అంతా ఎదురుచూసినా.. అందరికి తెలిసినా.. ఎప్పుడెప్పుడు ఆ ముహూర్తమో అనే ఆరాటం కనబరిచినా.. అభిమానులు ఎవరికీ చూపించకుండానే.. లేదులేదంటూనే పెళ్లి తతంగం పూర్తి చేసేశారు విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేయడంతో.. హంగామా ఏమీ లేకుండానే మ్యారేజ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట కూడా ఇలాంటి మెగా పెళ్లికే ప్లాన్ చేసేసుకుంటున్నారట.
రణవీర్ సింగ్.. దీపికా పదుకొనే కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమ గురించి చెప్పకపోయినా.. తనకు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదంటూ ఖాళీ ఉంగరం వేలు చూపించిన దీపికా పదుకొనే.. మాంచి ముద్దులు పెట్టేది మాత్రం రణవీరే అంటూ కితాబిచ్చింది. ఇప్పుడు వీరిద్దరు కుటుంబాలు పెళ్లి గురించిన మంతనాలు జరుపుతున్నాయట. రీసెంట్ గా దీపికా పదుకొనే కుటుంబ సభ్యులు.. బెంగళూరు నుంచి ముంబై వచ్చి రణవీర్ సింగ్ కుటుంబంతో సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారట.
గతికితే అతకదనే కాన్సెప్ట్ అక్కడ కూడా ఉన్నట్లుగా ఉంది. ఇళ్లకు కాకుండా.. వర్లిలో ఉన్న ఓ స్టార్ హోటల్ లో డిన్నర్ ప్లాన్ చేసి.. పెళ్లి కబుర్ల గురించి డిస్కషన్స్ చేసుకోవడంతో.. జనాలకు బాగానే లీకులు అందేశాయి. డిప్స్ తో వీర్ వెడ్డింగ్ ని కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ తోనే చేయాలని నిర్ణయించారట. సౌత్ ఇండియన్ స్టైల్ లో ఈ పెళ్లి జరుగుతుందని.. ప్రస్తుతం మ్యారేజ్ షాపింగ్ లో ఇరు కుటుంబాలు ఉన్నాయని టాక్.