నేడు మరోసారి స్టార్‌ కపుల్‌ వివాహం

Update: 2018-11-15 07:20 GMT
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌ వీర్‌ సింగ్‌ - దీపిక పదుకునే నిన్న ఇటలీలో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహంలో అతి కొద్ది మంది మాత్రమే ప్రముఖులు హాజరు అయ్యారు. నిన్న సౌత్‌ ఇండియన్‌ కొంకణి సాంప్రదాయ బద్దంగా వీరి వివాహం జరిగింది. నేడు సింధి సాంప్రదాయంతో మరోసారి వీరి వివాహంను కుటుంబ సభ్యులు చేయబోతున్నారు. దీపిక పదుకునే కొంకణి మరియు రణ్‌ వీర్‌ సింగ్‌ సింధి కనుక వీరి వివాహంను రెండు సాంప్రదాయాల్లో నిర్వహించారు.

స్టార్‌ కపుల్‌ వివాహాలు రెండు సాంప్రదాయాల్లో జరగడం కొత్తేం కాదు. జంటలో ఇద్దరు వేరు వేరు సాంప్రదాయాలు - మతాలకు చెందిన వారు అయితే రెండు రోజుల పాటు వివాహాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సమంత మరియు నాగచైతన్యలు కూడా హిందూ మరియు క్రిస్టియన్‌ స్టైల్‌ లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. త్వరలో జరుగబోతున్న ప్రియాంక చోప్రా - నిక్‌ జొనాస్‌ ల వివాహం కూడా రెండు సాంప్రదాయాల్లో జరుగనుంది.

ఇటలీకి చెందిన ఐలాండ్‌ లేక్‌ కోమాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మద్య రణ్‌ వీర్‌ సింగ్‌ - దీపికల వివాహం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. పెళ్లి వేడుకకు హాజరు అయిన వారు ఎవరు కూడా ఫొటోలు తీయవద్దని మొదటే కండీషన్‌ పెట్టారట. పెళ్లికి హాజరు అయిన ప్రతి ఒక్క సెలబ్రెటీకి కూడా క్యూఆర్‌ కోడ్‌ కలిగిన కార్డు ఇవ్వడం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లలో నిన్న పెళ్లి చేసుకున్న వీరిద్దరు - నేడు అంతే వైభవంగా మరో సారి పెళ్లికి సిద్దం అవుతున్నారు. పెళ్లిని ముగించుకుని వచ్చే ఈ స్టార్‌ కపుల్‌ బాలీవుడ్‌ ప్రముఖుల కోసం, మీడియా వారి కోసం ఈనెల చివర్లో రిసెప్షన్‌ ను ముంబయిలో భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్నారట.

Tags:    

Similar News