దీపిక లిప్ లాక్స్..భ‌ర్త‌కి గ‌ర్వ‌కార‌ణం!

Update: 2022-02-13 05:57 GMT
`గెహ్రైయాన్` చిత్రంలో దీపికా ప‌దుకొణే-సిద్దార్ధ్ చ‌తుర్వేదితో రొమాంటిక్ స‌న్నివేశాల్లో ఏ రేంజ్  లో చెల‌రేగిందో చెప్పాల్సిన ప‌నిలేదు. పెద‌వి ముద్దులు..ఇంటిమేంట్ స‌న్నివేశాల్లో మరోసారి దీపిక మార్క్ వేసింది. ట్రైల‌ర్ రిలీజ్ తోనే దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. దీపిక రొమాన్స్ పై ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు.

పెళ్లైన దీపిక ఏమాత్రం మార‌లేద‌ని...క‌నీస నియ‌మ నిబంధ‌న‌లు పెట్టుకోకుండా ముందుకు వెళ్తుందంటూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది. దీనికి దీపిక త‌న‌దైన శైలిలో ట్రోల‌ర్ల‌కి బ‌ధులిచ్చింది.  ఇలాంటి కామెంట్ల‌ను..ట్రోలింగ్ ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని..త‌న వృత్తిపై తన‌కు ఓ క్లారిటీ ఉంద‌ని క్లాస్ తీసుకుంది.

ఇటీవ‌లే  గా అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ అయింది. మ‌రి ఇందులో దీపిక ఎలాంటి పాత్ర పోషించింది?  ఆ రేంజ్ లో  ఎందుకు  రొమాన్స్ పండిచాల్సి వ‌చ్చిందంటే?  ఇందులో దీపిక పాత్ర‌ త‌న క‌జిన్ బోయ్ ప్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుంటుంది. దీనిలో భాగంగా దీపిక సీన్ డిమాండ్ చేసిన‌ప్పుడ‌ల్లా రొమాన్స్ లో పీక్స్  కి చేరింది. గ‌తంలోనూ ఇంటిమేట్ స‌న్నివేశాల్లో న‌టించింది.

కానీ  గెహ్రైయాన్` లో  మాత్రం గ‌త సినిమాల్లో మించి రొమాన్స్ పండించింది. తాజాగా ఈ విష‌యంపై దీపిక భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్ స్పందించారు. ``సినిమాలో దీపిక న‌ట‌న‌ల అద్భుతం. ఆమెను చూస్తుంటే ఎంతో గ‌ర్వంగా ఉంది. దీపిక ఏంటో ఈ సినిమాతో రుజువు చేసుకుంది`` అంటూ కీర్తించారు.

ర‌ణ‌వీర్ వ్యాఖ్య‌ల‌తో  కొంత మంది ఏకీభ‌వించగా..మ‌రికొంత మంది వ్య‌తిరేకిస్తున్నారు. పెళ్లి చేసుకున్న భ‌ర్త భార్య‌ని ఇలాంటి స‌న్నివేశాల విష‌యంలో ప్రోత్స‌హించ‌డం ఏంట‌ని మండిప‌డుతున్నారు. వివాహ బంధం విలువలు రోజు రోజుకి మ‌రింత క్షీణించిపోతున్నాయ‌ని కామెంట్లు చేస్తున్నారు. భార‌తీయ మ‌హిళ‌లు ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాలిగానీ..ఇలా విలువ‌లు దిగ‌జార్చేలా ఉండ‌కూడ‌దంటూ ఫైర్ అవుతున్నారు.

ఇంకొంత మంది దీపిక చాలా ల‌క్కీ. త‌న‌ని బాగా అర్ధం చేసుకునే ర‌ణ‌బీర్ లాంటి వ్య‌క్తి జీవిత భాగ‌స్వామిగా దొరికారు. ఆయ‌న ఇలా ఎంక‌రేజ్ చేస్తే దీపిక ఎన్నో శిఖ‌రాల్ని అధిరోహిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News