దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. పలువురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కి కూడా ఎన్సీబీ నోటీసులు ఇచ్చింది. 2017లో దీపికా ఆమె మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు క్వాన్ టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో జరిపిన వాట్సాప్ ఛాట్ బయటపడటంతో ఎన్సీబీ ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపికా రేపు ఎన్సీబీ విచారణకు హాజరుకానుంది. అయితే దీపికా మేనేజరు కరిష్మా ప్రకాష్ నేడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరయ్యారు.
కాగా, డ్రగ్ చాట్ కోసం క్రియేట్ చేయబడిన వాట్సాప్ గ్రూప్ కి దీపికా పదుకొనే అడ్మిన్ గా ఉన్నారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించినట్లు ఇండియా టుడే ఛానల్ పేర్కొంది. అలానే ఈ గ్రూప్ లో కరిష్మా ప్రకాష్ - జయ సాహా కూడా ఉన్నట్లు చెప్పింది. అంతేకాకుండా ఈ వాట్సాప్ గ్రూప్ కి 'DP + KA + KWAN' అని పేరు పెట్టారని.. ఇక్కడ 'DP' అంటే దీపికా పదుకొనే 'KA' కరిష్మా అయ్యుండొచ్చని రిపబ్లిక్ టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ వాట్సాప్ గ్రూప్ ని జయ సాహా ఏర్పాటు చేసిందని.. దీపికా పదుకొనే మరియు కరిష్మా ప్రకాష్ అడ్మిన్స్ గా ఉన్నారని.. విజయ్ సుబ్రమణ్యం - అనిర్బన్ దాస్ - నిర్మాత మధు మంతేనా - KWAN సీఈఓ ధ్రువ్ చిట్గోపేకర్ ఈ గ్రూప్ లో ఇతర సభ్యులని రిపబ్లిక్ పేర్కొంది. ఈ గ్రూప్ లో 2017లో 'మాల్' 'హాష్' గురించి డిస్కస్ చేసారని.. ఈ చాట్స్ ని బట్టి వీరందరితో దీపికా ఒక పార్టీని కూడా నిర్వహించాల్సి ఉందని.. KWAN ఉన్నతాధికారుల క్రింద డ్రగ్ చాట్స్ జరుగుతున్నాయని ఇది నిర్ధారిస్తుందని రిపబ్లిక్ టీవీ చెప్పుకొచ్చింది.