లండన్ లో దీపికా ఇల్లు

Update: 2018-01-11 11:23 GMT
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత తరహాలో సినిమా రంగంలో కూడా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆస్తులు కూడబెట్టుకోవాలి అని నానుడి ఉంది. కొందరు దాన్ని సిన్సియర్ గా ఫాలో అవుతూ ఉంటారు. శోభన్ బాబు, మురళి మోహన్ లాంటి హీరోలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా జాగ్రత్త పడకుండా కెరీర్ చివరి దశలో సర్వం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. అందుకే సినీ తారలు ఇప్పుడు చాలా ప్లాన్డ్ గా ఉంటున్నారు. స్తిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయటం, ఫ్రాంచైజీలు తీసుకోవడం ఇలా ఒకటి రెండు కాదు లేండి. సినిమాల్లో ఉన్నా లేకపోయినా స్థిరమైన ఆదాయం ఉండేలా రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. పద్మావత్ హీరొయిన్ దీపికా పదుకునే కూడా ఆలాంటి ప్లాన్స్ లోనే ఉంది.

లండన్ లో ఇటీవలే ఒక ఖరీదైన విల్లా దీపికా పదుకునే కొనుగోలు చేసిందట. దాని కోసం ఇప్పటి దాకా తాను కష్టపడి సంపాదించిన దాంట్లో మేజర్ షేర్ ఇందులోనే ఇన్వెస్ట్ చేసిందట. తన ఫేవరేట్ డెస్టినేషన్ అయిన లండన్ లో తనకంటూ ఒక ఇల్లు ఉంటె భవిష్యత్తులో ఇక్కడే స్థిరపడాలి అనే ప్రణాలిక తన దగ్గర ఉన్నట్టుంది. మిలియన్ల ఖరీదు చేసే ఆ ఇల్లు తన టేస్ట్ కు తగట్టు ఇంటీరియర్ డిజైన్ చేయిస్తోందట దీపికా. గృహ ప్రవేశం లాంటి ఫార్మాలిటీస్ అన్ని గప్ చుప్ గా జరిగిపోతాయి కాబట్టి ఇక్కడికి సమాచారం తెలిసే అవకాశం లేదు.

మరో పదిహేను రోజుల్లో విడుదల కానున్న పద్మావత్ విడుదల కోసం దీపికా ఎదురు చూస్తోంది. తీవ్ర వివాదాల మధ్య తన ముక్కు కోస్తాం - తల తీస్తాం అనే బెదరింపులు వచ్చినా నెరవకుండా ఎదురు నిలిచిన దీపికా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకంతో ఉంది. కాని కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఎత్తి వేసే సూచనలు కనిపించడం లేదు. పైగా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి విడుదల చేసుకోమన్నా కర్ణి సేన మాత్రం వదిలే ప్రసక్తే లేదు అంటోంది. జనవరి 25 పద్మావత్ విడుదల అవుతున్న రోజు ఉద్రిక్త సంఘటనలు జరిగే అవకాశం ఉండటంతో ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సిద్దపడుతోంది. 
Tags:    

Similar News