ఫోటో స్టొరీ: మహారాణి దీపిక వచ్చిందహో..!

Update: 2019-09-06 07:46 GMT
బాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరు అంటే మరో మాట లేకుండా దీపిక పదుకొనె పేరు చెప్పాలి.  అప్పట్లో ప్రియాంక చోప్రా టాప్ పొజిషన్లో ఉండేది కానీ ప్రియాంక అమెరికాలో సెటిల్ అయిపోవడంతో ఆ పొజిషన్ కాస్తా దీపిక బుట్టలో పడింది.  దీపిక పోయినేడాది రణవీర్ సింగ్ ను వివాహమాడి శ్రీమతిగా మారిపోయిన సంగతి తెలిసిందే.  ఆప్పటి నుంచి సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటోంది.  

ఇదిలా ఉంటే తాజాగా దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబూ జానీ సందీప్ ఖోస్లా వారు నిర్వహించే ఫ్యాషన్ షో లో పాల్గొని వారు డిజైన్ చేసిన ప్రత్యేకమైన దుస్తులలో ర్యాంప్ వాక్ చేసి అందరినీ మాయ చేసేసింది. ర్యాంప్ వాక్.. ఫ్యాషన్ అనగానే సహజంగా పిచ్చుక గూడు లాంటి జుట్టు.. చిరిగిన బట్టలు..  చంద్రమండలంలో తప్ప భూగోళంలో ఎవరూ వేసుకోని వింత దుస్తులు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఈ షో లో మాత్రం ట్రెడిషనల్ ఛోళి.. లెహెంగా లో దీపిక ఒక యువరాణిలా కనిపించింది. క్రీమ్ కలర్ లో ఎంతో అందమైన ఎంబ్రాయిడరీ ఉన్న డ్రెస్ ధరించి..  తలపై దుపట్టాతో ఎంతో హుందాగా నడుస్తూ ఉంటే చూపరులు తమ కళ్ళు తిప్పుకోలేకపోయారు.  పర్ఫెక్ట్ మేకప్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ ధరించి తన స్టైలింగ్ ను మరింత అందంగా ఉండేలా తీర్చిదిద్దింది దీపిక.  ఈ డ్రెస్ పేరు చికంకరీ ఐవరీ గోల్డ్ లెహంగా అంట. మరి ఈ డ్రెస్సు రేటు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది లెండి.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. లైక్స్ తో.. షేర్లతో నెటిజన్లు హోరెత్తించారు.  రియల్ బ్యూటీ క్వీన్ అంటూ పొగడ్తలు కురిపించారు.  ఇక సినిమాల విషయానికి వస్తే దీపిక ప్రస్తుతం 'ఛపాక్'.. '83' చిత్రాల్లో నటిస్తోంది.

Tags:    

Similar News