మ్యాడమ్ తుస్సాడ్స్ బరువెక్కిపోతోంది. బ్యాంకాక్ - లండన్ - దిల్లీలో ఉన్న ప్రముఖ తుస్సాడ్స్ మ్యూజియంలో అంతా మనోళ్లే కనిపిస్తున్నారు. దాదాపు 10-20 మంది భారతీయ విగ్రహాలు తుస్సాడ్స్ లో తిష్ఠ వేసి ఉంటాయన్నది ప్రాథమిక అంచనా. అంతేకాదు.. ఈ క్యూ ఇంకా ఇంకా పెరుగుతోంది. ఇప్పటికిప్పుడు దీపిక పదుకొనే - షాహిద్ కపూర్ ల మైనపు విగ్రహాల్ని ఆవిష్కరించేందుకు మ్యూజియం నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి కొలతల్ని సంగ్రహించారు.
ఇక పద్మావత్ గా ఓ వెలుగు వెలిగిన దీపిక మైనపు విగ్రహం మ్యూజికమ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. డిప్స్ వ్యాక్స్ స్టాట్యూని కాస్ట్ లీగా రూపొందిస్తున్నారట. ఈ విగ్రహం ధరించే లెదర్ ఫ్యాంట్స్ ఖరీదు 1.7లక్షలు. అంటే ఇతరత్రా యాక్ససరీస్ వగైరా ఇంకెంతో కాస్ట్ ఉంటాయోనన్న చర్చా సాగుతోంది. అటు లండన్ - ఇటు దిల్లీ రెండుచోట్లా ఒకే తరహా దీపిక విగ్రహాల్ని ఆవిష్కరించనున్నారు. అటు పాశ్చాత్యులకు - ఇటు భారతీయులకు పద్మావత్ వాస్తవిక దివ్యరూపం కళ్లముందు సాక్షాత్కరించనుందన్నమాట! వీళ్లతో పాటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ విగ్రహాన్ని తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.