దీపిక మాయతో ఇండియాలో ప్రీమియర్ షో

Update: 2017-01-05 07:45 GMT
ఇండియన్ మూవీస్ ను ఓవర్సీస్ లో ప్రీమియర్స్ వేసుకుని డబ్బులు చేసుకునే కాన్సెప్ట్ బాగానే నడుస్తోంది.. కొంతమేరకు వర్కవుట్ అవుతోంది కూడా. కానీ ఓ హాలీవుడ్ మూవీ ఇండియాలో ప్రీమియర్స్ వేయడం అంటే మాత్రం రికార్డ్ అనే చెప్పాలి. గతంలో ఒకట్రెండు సినిమాలకు ఇలా జరిగినా.. అది కేవలం అమెరికా రిలీజ్ కి ముందు రోజు నైట్ మాత్రమే.

కానీ హాలీవుడ్ యాక్షన్ హీరో విన్ డీజిల్ తో కలిసి దీపికా పదుకొనే నటించిన ట్రిపుల్ ఎక్స్-రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ మూవీని ఇండియాలో గ్రాండ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రపంచాన్ని నాశనం చేయగల ఒక శక్తివంతమైన ఆయుధం దుర్మార్గుల బారిన పడకుండా హీరో ఎలా కాపాడాడు.. అందుకోసం హీరో లవర్ సెరెనాగా నటించిన దీపికా ఎలా హెల్ప్ చేసిందన్నదే ఈ మూవీ స్టోరీ. భారత్ లో ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ రిలీజ్ చేస్తుండగా.. జనవరి 14న గ్రాండ్ గా ప్రీమియర్స్ వేస్తున్నారు.

ఇలా హాలీవుడ్ మూవీని ఇండియాలో ప్రీమియర్స్ ప్రదర్శించడం అంటే.. అదంతా కేవలం దీపికా పదుకునే పుణ్యమే అని చెప్పాలి. కేవలం 2డీ వెర్షన్ మాత్రమే కాకుండా.. 3డీ.. ఐమ్యాక్స్ 3డీ వెర్షన్లను కూడా  ప్రీమియర్ల ద్వారా ప్రదర్శించనున్నారట. ప్రపంచం అంతా జనవరి 19న ఈ మూవీ విడుదల కానుంటే.. ఇండియన్ ఆడియన్స్ కి మాత్రం దీపికా పదుకొనే మాయతో పొంగల్ పండుగ రోజునే చూసే భాగ్యం దక్కుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News